వైరల్ వీడియో: వామ్మో ఈ జంతువు ఏంటి ఇలా ఉంది.. మత్స్యకారునికి షాకింగ్ ఘటన..

మనకు తెలియకుండానే భూమిపై ఎన్నో విచిత్రమైన, ప్రత్యేకమైన జీవులు దాగి ఉన్నాయి.అప్పుడప్పుడు కొన్ని రకాల కొత్త జీవులు పుట్టడం చూస్తుంటాం.

 Viral Video Whammo What Is This Animal Like This Shocking Incident For The Fishe-TeluguStop.com

ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.ఇలాంటి వింత జీవులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ నెట్‌వర్క్‌ లలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఇలాంటి వీడియో ఇంటర్నెట్‌ ( Video Internet )లో వైరల్ గా మారింది.పడవలో ప్రయాణిస్తున్న ఓ మత్స్యకారుడికి వింత అనుభవం ఎదురైంది.

నీళ్లలోంచి పడవలోకి ప్రవేశించిన ఓ వింత ప్రాణిని చూసి ఓ వ్యక్తి ఆశ్చర్యపోయాడు.చివరికి అక్కడ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మత్స్యకారుడు( Fisherman ) పడవలో ప్రయాణిస్తుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది.నీటిలో తేలియాడుతున్న ఓ జీవి ఒడ్డుకు వెళ్తున్న పడవను సమీపించింది.పడవ సమీపిస్తుండగా, ఆ జివి నిలబడి ఉన్న పడవను పట్టుకుని అందులో ఎక్కుతుంది.నిశితంగా పరిశీలిస్తే.అది స్పైడర్ కోతి అని తెలుస్తుంది.

ఆ కోతి పడవపైకి వచ్చి ఆ తర్వాత ముందుకు వెళ్లి కూర్చుంటుంది.వారు కోతిని బలవంతంగా దింపడానికి సమీపంలోని అటవీ ఒడ్డుకు తీసుకువెళతారు.

చివరగా కోతి పడవ నుండి దూకి సమీపంలోని అడవిలోకి వెళ్తుంది.ఈ స్పైడర్ కోతులు ప్రధానంగా మెక్సికో నుండి బ్రెజిల్ ( Brazil )వరకు అడవులలో, దక్షిణ అమెరికాలలో కనిపిస్తాయి.

పొడవాటి తోక మరియు అవయవాల కారణంగా ఈ కోతులు వింతగా కనిపిస్తాయి.

ఈ కోతులు పండ్లు తిని జీవిస్తాయి.ఆకులు, పూలు, కీటకాలను కూడా కాలానుగుణంగా తింటాయి.ఇవి ప్రధానంగా తేమతో కూడిన అడవులలో నివసిస్తున్నారు.

వీటిలో చాలా జాతులు ప్రస్తుతం అంతరించిపోతున్న వాటి జాబితాలో ఉన్నాయి.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో సోషల్ మీడియా వినియోగదారులు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube