ఏపీలోని ప్రతిపక్షాలపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Karumuri Venkata Nageswara Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ ( AP Land Titling Act )విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని మంత్రి కారుమూరి తెలిపారు.మోడల్ యాక్ట్ పై అభిప్రాయసేకరణ మాత్రమే జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘాని( Electoral Commission )కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కేంద్రం అమలు చేసే యాక్టుపై కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.