కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో( Pulivendula Constituency ) సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి( YS Bharati ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.పట్టణంలోని వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ నుంచి ప్రచారం ప్రారంభమైంది.
అంబేద్కర్ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు మీదుగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.వైఎస్ భారతితో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy ) సతీమణి సమిత కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఐదేళ్ల పాలనలో సీఎం జగన్( CM Jagan ) అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వైఎస్ భారతి ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.కాగా నియోజకవర్గంలో వైఎస్ భారతికి మహిళలు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.