ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో నందమూరి బాలకృష్ణ పర్యటించారు.స్వర్ణాధ్ర సాకార యాత్రలో భాగంగా గూడూరు చేరుకున్న బాలయ్య కు ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికారు.
కోర్టు సెంటర్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు.బాలయ్యకు భారీ గజమాలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
బాలయ్యను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా అభిమానులు ,మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.యువత బాలయ్యతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ గెలిపించాలని కోరారు.