విశాఖ రైల్వే జోన్ పై( Visakha Railway Zone ) కేంద్రమంత్రి పీయూష్ గోయల్( Piyush Goyal ) చేసిన విమర్శలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) కౌంటర్ ఇచ్చారు.రైల్వే జోన్ ఏర్పాటు జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడమే కారణమంటూ పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలాన్ని రైల్వేకు ఎప్పుడో అప్పగించిందని పేర్కొన్నారు.అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలనుకోవడం పీయూష్ కు తగదని చెప్పారు.ఈ మేరకు ఆధారాలు చూపిస్తూ డాక్యుమెంట్లను మంత్రి బొత్స ప్రదర్శించారు.అనంతరం ఎలక్ట్రోరల్ బాండ్ల లావాదేవీలపై బీజేపీ సమాధానం చెప్పాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు.