బీఆర్ఎస్ వలనే సంక్షోభంలో చేనేత రంగం..:మంత్రి పొన్నం

తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar ) కీలక వ్యాఖ్యలు చేశారు.బలవన్మరణాలకు పాల్పడిన చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

 Handloom Sector In Crisis Because Of Brs..: Minister Ponnam , Minister Ponnam P-TeluguStop.com

ముందుగా మరణించిన చేనేత కార్మికులకు మంత్రి పొన్నం సంతాపం తెలిపారు.కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటానికి బీఆర్ఎస్, బీజే( BRS, BJP )పీనే కారణమని ఆరోపించారు.బాధిత కుటుంబాలకు అన్ని రకాల సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు వలనే చేనేత రంగం సంక్షోభంలో పడిందన్నారు.అయితే తమ ప్రభుత్వం చేనేతలకు అండగా ఉంటుందని, చేనేత కార్మికుల పాత బకాయిలను కూడా చెల్లిస్తామని మంత్రి పొన్నం తెలిపారు.

సిరిసిల్ల చేనేత కార్మికులకు పని లేదనే పరిస్థితి రానివ్వమని స్పష్టం చేశారు.చేనేత కార్మికులు అధైర్య పడొద్దని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube