పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి( Peddapalli BJP Candidate ) ఎవరనే దానిపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది.ఈ మేరకు ఇద్దరి పేరుమీద పార్టీ హైకమాండ్ బీ-ఫామ్స్ సిద్ధం చేసిందని తెలుస్తోంది.
ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్( Gomasa Srinivas ) పేరు మీద బీ-ఫామ్ రిలీజ్ చేసిన బీజేపీ అధిష్టానం ఆల్టర్ నెట్ అభ్యర్థిగా ఎస్ కుమార్( S Kumar ) పేరును చేర్చిందని సమాచారం.ఇప్పటికే గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
అదే స్థానం నుంచి ఇవాళ ఎస్ కుమార్ నామినేషన్ వేయనున్నారు.
అయితే నామినేషన్ ఉపసంహరణ గడువులోగా ఇద్దరి అభ్యర్థులో ఒకరికి హైకమాండ్ బీ-ఫామ్ అందించనుంది.
ఈ క్రమంలో పెద్దపల్లి పార్లమెంట్( Peddapalli Parliament ) నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఎవరిని బరిలో ఉంచుతారోనన్న వ్యవహారంపై జిల్లా నేతల్లో ఉత్కంఠ నెలకొంది.అయితే గోమాస శ్రీనివాస్ వైఖరిపై నియోజకవర్గ నేతల నుంచి అసంతృప్తులు వ్యక్తమైన నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆల్టర్ నెట్ అభ్యర్థి పేరును కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.







