రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ( Vemulawada) దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని కోడేల కోసం ప్రభుత్వం మెగా వైద్య శిబిరాన్ని( Mega medical camp) విజయవంతంగా నిర్వహించింది.కోడె మొక్కులు చాలా ప్రసిద్ధి, కోడెను కడితే చాలు కోరిన కోరికలు తీర్చే రాజన్న కోడెల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
రెండు రోజుల క్రితం శ్రీ రాజరాజేశ్వర పుణ్యక్షేత్రానికి వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు( Hanumantha Rao ) రాజన్న దర్శనం అనంతరం గోశాల లను సందర్శించి, కోడెల సంరక్షణ పై తీసుకుంటున్న చర్యలకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అవసరమైన వైద్య చికిత్స, వ్యాక్సినేషన్ అందించాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కమిషనర్ ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోశాలలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి 1093 కోడెలకు వ్యాక్సినేషన్ చేయడంతో పాటు వివిధ రకాల రుక్మతులతో బాధపడుతున్న వాటికి వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించారు.
కోడెలకు ఇలాంటి వ్యాధులు ఎందుకు వ్యాపిస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకునేందుకు వైద్యులు క్షేత్రస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఈ నివేదికను రాష్ట్ర సీఎం ఓ కు అందించనున్నారు.కమిషనర్ గోషాలను పరిశీలించిన విషయం సి.ఎం.ఓ దృష్టికి వెళ్లగా విషయంపై ఆరా తీసిన సంబంధిత అధికారులు పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులను మొత్తం చేసి వెంటనే రాజన్న కోడెల సంరక్షణకు చర్యలు చేపట్టాలని, కోడెలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.సి.ఎం.ఓ ఆదేశాలతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ మంజువాణి పర్యవేక్షణలో గురువారం కోడెలకు వైద్య పరీక్షలు వ్యాక్సినేషన్ ( Vaccination )నిర్వహించారు.రెండు గోశాలలో ఉన్న 1093 కోడెలకు 8 మంది వైద్యులు, 15 మంది సిబ్బంది సహకారంతో వైద్య పరీక్షలతో పాటు అవసరం ఉన్న కోడెలకు వ్యాక్సినేషన్, గాలి కొంటూ వ్యాధి టీకాలు వేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కొమురయ్య, ఈవో కృష్ణ ప్రసాద్, వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.