ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ప్లేయర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొడుతున్నారు.బ్యాట్స్‌మెన్లు మంచిగా ఆడుతూ, బౌండరీలు, సెంచరీలు బాదుతూ ఉన్నారు.
బౌలర్లు ఎంత నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, బ్యాట్స్‌మెన్ల దాడి ముందు చాలా సార్లు చేతులెత్తుకోవాల్సి వస్తోంది.అయితే, ఈ బ్యాటింగ్ పరంపరలో కొంతమంది బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేస్తూ, పరుగుల వేగాన్ని నియంత్రించడమే కాకుండా, కీలక వికెట్లు తీస్తూ రాణిస్తున్నారు.
ఈ బౌలర్ల తెలివితేటలు, నైపుణ్యంతో మ్యాచ్‌ల ఫలితాలను మార్చేస్తున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఖలీల్ అహ్మద్( Khalil Ahmed ) ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు.8 మ్యాచ్‌ల్లో 31 ఓవర్లు వేసి 10 వికెట్లు పడగొట్టాడు.ఈ సమయంలో 280 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, 37 డాట్ బాల్స్ వేశాడు, అంటే బ్యాట్స్‌మెన్ ఒక్క పరుగు కూడా చేయలేని బంతులు.
ముంబై ఇండియన్స్‌కు చెందిన జస్ప్రిత్ బుమ్రా( Jasprit Bumrah ) ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న మరొక బౌలర్.డాట్ బాల్స్ విషయంలో అతను ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు.8 మ్యాచ్‌ల్లో 32 ఓవర్లు వేసి 204 పరుగులు మాత్రమే ఇచ్చి 13 వికెట్లు తీశాడు.అతను 80 డాట్ బాల్స్ వేశాడనే విషయం చాలా ఆకట్టుకునేది.

చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న తుషార్ దేశ్‌పాండే( Tusshar Deshpande ) తన “మాయా” బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.69 డాట్ బాల్స్ వేసి బ్యాట్స్‌మెన్‌లను పరుగులు చేయకుండా అడ్డుకుంటున్నాడు.7 మ్యాచ్‌ల్లో 26 ఓవర్లు వేసి 6 వికెట్లు తీసి 216 పరుగులు మాత్రమే ఇచ్చాడు.డాట్ బాల్స్ విషయంలో అతను నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో ఆడుతున్న న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు.డాట్ బాల్స్ వేసే విషయంలో అతను ఐదో స్థానంలో ఉన్నాడు.7 మ్యాచ్‌లలో 24 ఓవర్లు వేసి 117 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు.అతను 68 డాట్ బాల్స్ వేశాడు.మొత్తం మీద ఈ బౌలర్లు తమ సత్తా చాటుతూ అందరి దృష్టిలో పడుతున్నారు.తమ బౌలింగ్ స్కిల్స్ ని ప్రదర్శిస్తూ తమకంటే తోపులు ఎవరూ లేరని నిరూపిస్తున్నారు.మరి ఈసారి సీజన్ లో ఏ టీం విన్ అవుతుందో చూడాలి.







