త్వరలో లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) రానున్న నేపథ్యంలో ఖమ్మంలో పొలిటికల్ హీట్( Khammam Politics ) రోజురోజుకు పెరుగుతోంది.కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనే దానిపై అధికారిక ప్రకటన రాకముందే నేతలు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు.
ఈ మేరకు ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రఘురాం రెడ్డి తరపున స్థానిక నేతలు నామినేషన్ వేశారు. ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాం ( Khammam MP Candidate Raghuram )తరపున రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
రఘురాం రెడ్డి తరపున నిరంజన్ రెడ్డి, స్వర్ణకుమారి, రాజశేఖర్, నరేశ్ రెడ్డి మరియు రామ్మూర్తి నాయక్ నామినేషన్ దాఖలు చేశారు.అయితే నామినేషన్ గడువు( Nomination ) ముగియనున్నప్పటికీ ఏఐసీసీ ఇప్పటివరకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పేరును ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రఘురాం రెడ్డి అనుచరులు నామినేషన్ వేశారు.అయితే ఖమ్మం ఎంపీ స్థానం కోసం పలువురు నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే.