సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.
తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.
విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.
అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో తమకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలని సిక్కులు ఆందోళనలు చేస్తున్నారు.

కాగా.కొద్దిరోజుల క్రితం ఇటలీలోని మిలన్ నగరంలో( Milan, Italy ) కిర్పాన్ (కత్తి)ని వెంట తీసుకెళ్లినందుకు గాను అమృతధారి సిక్కు గుర్బచన్ సింగ్‌పై ( Gurbachan Singh ) అభియోగాలు మోపిన చర్యను సిక్కుల అత్యున్నత నిర్ణాయక విభాగాలైన అకల్ తఖ్త్, శిరోమణి ( Akal Takht, Shiromani )గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) తీవ్రంగా ఖండించింది.అకల్ తఖ్త్ జాతేదార్ గియానీ రఘ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ.సిక్కుల ఐదు కకార్లలో (విశ్వాసానికి చిహ్నాలు) కిర్పాన్ ఒకన్నారు.సిక్కు ప్రవర్తనా నియమావళి ప్రకారం అమృతధారి సిక్కు ఎల్లప్పుడు దానిని తన శరీరంపై వుంచుకుంటాడని రఘ్‌బీర్ సింగ్( Raghbir Singh ) తెలిపారు.దీక్ష పొందిన సిక్కు శరీరం నుంచి కిర్పాన్‌ను వేరు చేయడం సిక్కుల మత స్వేచ్ఛకు విరుద్ధమన్నారు.

కాగా.గుర్బచన్ సింగ్‌పై నమోదైన కేసును తీవ్రంగా వ్యతిరేకించాలని ఎస్‌జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి ( Harjinder Singh Dhami )ఇటలీలోని సిక్కు సమాజానికి విజ్ఞప్తి చేశారు.ఈ కేసుకు సంబంధించిన మొత్తం వివరాలను ఎస్‌జీపీసీకి తెలియజేయాలని ఆయన వారిని కోరారు.ఈ వ్యవహారంలో భారత్‌లోని ఇటలీ రాయబారి, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాల్సిందిగా లేఖ రాస్తామని ధామి స్పష్టం చేశారు.
సిక్కుల హక్కులు, కిర్పాన్ ప్రాముఖ్యత గురించి సమాచారం వారికి పంపుతామని ఆయన వెల్లడించారు.సిక్కులు ప్రపంచంలోని అనేక దేశాల్లో నివసిస్తున్నారని.అక్కడ తమ కృషి, పట్టుదల, నిజాయితీలతో అసాధారణ విజయాలు సాధించారని ధామి ప్రశంసించారు.అమెరికా, యూకే, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ సిక్కులు కిర్పాన్ ధరించడానికి అనుమతి వుందని హర్జిందర్ సింగ్ ధామి పేర్కొన్నారు.







