శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు( MLC Thota Trimurthulu ) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ క్రమంలో తోట త్రిమూర్తులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు( AP High Court ) రేపు విచారించనుంది.అయితే ఏపీలో 28 ఏళ్ల నాటి శిరోముండం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.
కేసులో తోట త్రిమూర్తులతో పాటు తొమ్మిది మంది నిందితులుగా ఉండగా.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో( SC ST Atrocity Case ) తోట త్రిమూర్తులు పాత్రను ప్రాసిక్యూషన్ నిరూపించింది.
ఇందులో భాగంగానే తోట త్రిమూర్తులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.లక్షన్నర జరిమానా విధించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శిరోముండనం కేసు తీర్పు సంచలనంగా మారింది.