రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజల అప్రమత్తత, ఆలోచన, అవగాహన వల్లే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని జిల్లా ఎస్పీ తెలిపారు.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతోనే సైబర్ నేరాల్ల వలలో పడవద్దని,మొబైల్ ఫోన్ కి వచ్చే అనుమానిత సందేశాలు, లింకులు,సోషల్ మీడియా లో వచ్చే లింక్స్ నమ్మి ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దని ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు తక్షణమే కాల్ చేయాలని సైబర్ నేరాల పట్ల ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజులు వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు
● ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు ఇంస్టాగ్రామ్ లో ధని ఫైనాన్స్ అనే లింక్ చూసి దాన్ని క్లిక్ చేయగా ఒక లక్ష రూపాయలు లోన్ ఇస్తామని అతడికి వాట్సప్ లో మెసేజ్ రావడం జరిగింది.బాధితుడు అది చూసి రెస్పాండ్ కాగా దాని ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నట్టుగా చెప్పి అతను వద్దనుండి లోన్ సాంక్షన్ అయింది సంబంధించి ప్రాసెసింగ్ ఫ్రీ జీఎస్టీ అలాగే ఫస్ట్ ఈఎంఐ చార్జెస్ అని చెప్పి అమౌంట్ పంపించమనగా బాధితుడు 23,000/- రూపాయలు నష్టపోవడం జరిగింది.
● కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వాట్సాప్ లో గుర్తు తెలియని నెంబర్ నుండి ఎంటర్ క్యాప్చ వర్క్ పార్ట్ టైం జాబ్ అని మెసేజ్ రావడం జరిగింది.బాధితులు రెస్పాండ్ కావడంతో క్లిక్ ఇండియా అనే వెబ్సైట్లో క్యాప్ చార్జ్ ఎంటర్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పడంతో అది నమ్మి బాధితులు చేయగా ఇనిషియల్ గా ఒక అకౌంట్ ఓపెన్ చేసి వాళ్లకు అకౌంట్లో అమౌంట్ ఉన్నట్టుగా ఏర్పాటు చేసి ఆ అమౌంట్ తీసుకోవడానికి మీరు కొంత డిపాజిట్ చేయాలని చెప్పగా వారు అది నమ్మి దాదాపుగా 70,000/- రూపాయలను మోసపోవడం జరిగింది.
● వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు క్రెడిట్ బే యాప్ లో లోన్ అప్లై చేయడం జరిగింది.48 గంటలలో మీకు లోన్ రావడం జరుగుతుంది అని చూశారు దాంతో కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేయడానికి ఫేస్బుక్లో వెతకగా ఒక ఫ్రాడ్ నెంబర్ వచ్చింది.అతనికి కాల్ చేయగా అతడు మొబి క్విక్ యాప్ డీటెయిల్స్ ని షేర్ చేయమనగా బాధితుడు సస్పెక్ట్ కి తన మూవీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది.మరియు ఓటిపి షేర్ చేసుకోగా 40,600 /- రూపాయలు నష్టపోయారు.
● సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులకి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని కాల్ చేయగా బాధితుడు అది నిజమని అనుకొని క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మరియు ఓటీపీలో షేర్ చేసుకోవడం జరిగింది దాంతో 49,500/- రూపాయలు నష్టపోయారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:-
• మీకు లాటరి,లోన్ వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.ఆశపడకండి, అనుమానించండి.వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.• అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.• వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్రకటనలను నమ్మకండి.• తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.• మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.







