ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైస్ షర్మిల( YS Sharmila ) బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచీ జగన్ నే టార్గెట్ చేసుకుంటూ రాజకీయ విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్( AP Congress ) ను బలోపేతం చేయడం తో పాటు, కనీసం పది ఇరవై స్థానాల్లో అయినా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.
ఒకపక్క టీడీపీ, జనసేన, బీజేపీ( TDP Janasena BJP ) లు కలిసి కూటమిగా ఏర్పడి వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ ఉండడగా.షర్మిల కూడా అంతే స్థాయిలో వైసీపీని టార్గెట్ చేసుకుంది.
ఇక వైసీపీ కి గట్టి పట్టు ఉన్న రాయలసీమ లో జగన్ ప్రభావాన్ని తగ్గించేందుకు షర్మిల తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.
మొన్నటి వరకు వైస్ వివేకా హత్యా( Viveka Murder Case ) వ్యవహారం పై జగన్ , వైస్ అవినాష్ రెడ్డి లను టార్గెట్ చేసుకుంటూ తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు.అయితే వివేకా హత్యా వ్యవహారంపై ఇక పై ఎవరూ బహిరంగంగా విమర్శలు చేయడానికి వీల్లేదంటూ షర్మిల, సునీత, పవన్, చంద్రబాబు లకు కోర్టు నోటీసులు ఇవ్వడం తో ఆ వ్యవహారానికి బ్రేక్ పడింది.ప్రస్తుతం షర్మిల రాయలసీమ జిల్లాల్లో( Rayalaseema ) పర్యటిస్తున్నారు.
అక్కడ ఆమెకు ప్రజాదరణ బాగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది.రాయలసీమ జిల్లాల్లో షర్మిలకు కాస్తో కూస్తో ప్రజాదరణ ఉండడం, వైస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉండడం, షర్మిల చీల్చే ఓట్లు అన్నీ వైసీపీకి పడాల్సినవే కావడంతో వైసీపీ( YCP ) లో షర్మిల టెన్షన్ ఎక్కువగానే ఉంది.ముఖ్యంగా దళిత, ముస్లిం ఓటర్లు షర్మిల ప్రభావంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తే వైసీపీకి జరిగే నష్టం ఎక్కువగానే ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.ఇక రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపట్టడం కంటే రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువ ప్రచారం చేసేందుకు షర్మిల ఆసక్తి చూపిస్తున్నారు.