తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు.ఇక మణిరత్నం లాంటి దర్శకుడు తమిళ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఆయన తర్వాత ఇండస్ట్రీ కి వచ్చిన శంకర్ తను చేసిన మొదటి సినిమా అయిన జెంటిల్ మెన్ సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాడు.ఇక ఇప్పుడు ఆయన కమలహాసన్ తో భారతీయుడు( Bharateeyudu Movie ) సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2( Indian 2 ) అనే సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది.అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ స్టోరీ లీకైనట్టుగా తెలుస్తుంది.అదేంటంటే ఈ సినిమాలో భారతీయుడు గెటప్ లో ఉన్న కమల్ హాసన్( Kamal Haasan ) మళ్లీ అన్యాయం మీదనే యుద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో తన ఫ్రెండ్ అవినీతికి పాల్పడడంతో అంత మొందించడానికి ఈ సినిమాని రూపొందించినట్టుగా తెలుస్తుంది.
అయితే భారతీయుడు సినిమాలో తన కొడుకు అవినీతికి పాల్పడడం అనే అంశాన్ని చూశాం.ఇక ఇక్కడ తన ఫ్రెండ్ అవినీతికి పాల్పడడంతో అతన్ని అంత మందించడం కోసమే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో శంకర్( Shankar ) ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక విక్రమ్ సినిమా తర్వాత కమలహాసన్ ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపిస్తాడా లేదా అనే అంశాలు కూడా తెలియాల్సి ఉన్నాయి… శంకర్ ఈ సినిమాతో పాటుగా రాంచరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా కూడా చేస్తున్నాడు…
.