కారు ప్రమాదం కేసుపై మాజీ ఎమ్మెల్యే షకీల్( Ex MLA Shakeel ) స్పందించారు.ఈ మేరకు దుబాయ్ నుంచి ఆయన ఓ వీడియోను విడుదల చేశారని తెలుస్తోంది.
తన కుమారుడు రహెల్ ను( Rahel ) ఎవరూ అరెస్ట్ చేయలేదని మాజీ ఎమ్మెల్యే షకీల్ తెలిపారని సమాచారం.పోలీసులు అరెస్ట్ చేసినట్లు చూపిస్తున్నారన్న ఆయన తన కొడుకును జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
రాజకీయ కుట్రతోనే కేసులో తన కుమారుడిని ఇరికించారన్నారు.
తాను దుబాయ్ లో చికిత్స తీసుకుంటున్నానన్న షకీల్ పంజాగుట్ట ఘటనలో 21 కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే రాజకీయంగా మనం చూసుకుందామని, పిల్లలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు.తన కుమారుడికి ఏం జరిగినా పోలీస్ ఉన్నతాధికారులదే బాధ్యతని పేర్కొన్నారు.తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని చెప్పారు.ఈ నేపథ్యంలో కేసుపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు.
తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.అదేవిధంగా కేసుపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.