రహెల్ ను ఎవరూ అరెస్ట్ చేయలేదు..: మాజీ ఎమ్మెల్యే షకీల్

కారు ప్రమాదం కేసుపై మాజీ ఎమ్మెల్యే షకీల్( Ex MLA Shakeel ) స్పందించారు.

ఈ మేరకు దుబాయ్ నుంచి ఆయన ఓ వీడియోను విడుదల చేశారని తెలుస్తోంది.

తన కుమారుడు రహెల్ ను( Rahel ) ఎవరూ అరెస్ట్ చేయలేదని మాజీ ఎమ్మెల్యే షకీల్ తెలిపారని సమాచారం.

పోలీసులు అరెస్ట్ చేసినట్లు చూపిస్తున్నారన్న ఆయన తన కొడుకును జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ కుట్రతోనే కేసులో తన కుమారుడిని ఇరికించారన్నారు.తాను దుబాయ్ లో చికిత్స తీసుకుంటున్నానన్న షకీల్ పంజాగుట్ట ఘటనలో 21 కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే రాజకీయంగా మనం చూసుకుందామని, పిల్లలను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు.తన కుమారుడికి ఏం జరిగినా పోలీస్ ఉన్నతాధికారులదే బాధ్యతని పేర్కొన్నారు.

తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని చెప్పారు.ఈ నేపథ్యంలో కేసుపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు.

తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.అదేవిధంగా కేసుపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

మూడేళ్లలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కీర్తి.. ఈమె సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!