హైదరాబాద్ లోని పాతబస్తీలో లారీ డ్రైవర్ బీభత్సం( lorry driver panicked ) సృష్టించాడు.రాత్రి సమయంలో ఓ బైకును వెనుక నుంచి లారీ డ్రైవర్ ఢీకొట్టాడు.
తరువాత కిలోమీటర్లకు పైగా బైకును ఈడ్చుకుని వెళ్లాడు.ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న బైకు రైడర్ లారీ డోర్ పట్టుకుని వేలాడాడు.
అయినప్పటికీ సుమారు రెండు కిలోమీటర్ల వరకు లారీని డ్రైవర్ ఆపలేదని తెలుస్తోంది.ఈ క్రమంలో లారీ బ్యానెట్ పైనే నిలబడి ఆపాలంటూ బైక్ రైడర్ ఆర్తనాదాలు చేశాడు.
అడ్డుగా మరో వాహనం రావడంతో లారీని డ్రైవర్ ఆపాడు.కాగా ఈ ఘటనను లారీ వెనుక ఉన్న ఓ కారు డ్రైవర్ రికార్డ్ చేశాడు.
వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.







