కోదండ రాముని( Kodanda Ramudu ) కళ్యాణానికి కొబ్బరి బొండాలు రామనామ తలంబ్రాలు లక్ష మూడు వందల ముప్ఫై ముడు 100333 /- బియ్యపు గింజలపై రామనామాలు లిఖించిన యువ రాజారెడ్డి ( Raja Reddy ) గత 14 సంవత్సరాలుగా ప్రతి కళ్యాణానికి సమర్పిస్తున్న కొబ్బరి బొండాలు రామనామ తలంబ్రాలు( Rama Nama Talambralu ) కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు వ్యాయామదర్శకులు లయన్ ద్వారంపూడి యువ రాజారెడ్డి గత 14 సంవత్సరాలుగా శంకు చక్ర నామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలు రామనామ తలంబ్రాలు సిద్ధం చేసి స్వామివారి కళ్యాణం క్రతువుకు అందజేయడం జరుగుతుందని యువ రాజారెడ్డి తెలిపారు .
ఈ సంవత్సరం లక్ష మూడు వందల ముప్ఫై ముడు 100333 /- బియ్యపు గింజలపై రామ నామాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరం ఉపయోగించకుండా ప్రతినిత్యం పూజ అనంతరం ఉదయం సాయంత్రం సమయాలలో వీటిని మార్కర్ పెన్ను సహాయంతో రాయడం జరిగిందని యువరాజారెడ్డి తెలిపారు సంధ్య డెకరేషన్స్ ఆధ్వర్యంలో శంకు చక్ర నామ సహిత కొబ్బరిబండాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వాటిని కళ్యాణంలో వినియోగించాలని ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీ రామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డిని కోరినట్లు యువ రాజారెడ్డి తెలిపారు ఈ విధంగా స్వామివారి కల్యాణమునకు ఉడతా భక్తితో ఈ కళ్యాణ కొబ్బరి బొండాలను రామనామ తలంబ్రాలను సిద్ధం చేసి ఇవ్వడం పూర్వజన్మ సుకృతం అని గ్రామం సుభిక్షంగా ఉంటుందని రాజారెడ్డి తెలిపారు వీటిని కళ్యాణానికి కుటుంబ సభ్యులతో కలిసి అందజేయడం జరుగుతుందని యువరాజ రెడ్డి తెలిపారు
.