ఇటీవల పాపులర్ అమెరికన్ డ్రింక్ బ్రాండ్ ‘ప్రైమ్ హైడ్రేషన్’ ( Prime Hydration )ఫోర్ట్‌నైట్‌తో కలిసి ఒక అద్భుతమైన పోటీని నిర్వహించింది.ఈ పోటీకి “రెడ్ వర్సెస్ బ్లూ” ( Red vs.
Blue )అని పేరు పెట్టింది.ప్రముఖ యూట్యూబర్లు లోగాన్ పాల్, KSI ఈ పోటీకి సహకారం అందించారు.
వారు ఒక ప్రత్యేక ఫోర్ట్‌నైట్ మ్యాప్‌ను కూడా రూపొందించారు.ఈ మ్యాప్ ప్రైమ్ బ్రాండింగ్ నుంచి స్ఫూర్తి పొందింది.
రెడ్ వర్సెస్ బ్లూ యుద్ధం ఆధారంగా రూపొందింది.
ఈ పోటీ చాలా విజయవంతమైంది.
చాలా మంది ఆటగాళ్లు పాల్గొన్నారు.గెలిచిన ఆటగాళ్లకు ప్రత్యేకమైన ప్రైమ్ బహుమతులు లభించాయి.
ఈ బహుమతులు పరిమిత ఎడిషన్‌లో మాత్రమే ఉండటం వల్ల చాలా ప్రత్యేకమైనవిగా నిలిచాయి.స్టోర్లలో వీటిని కొనుగోలు చేయలేం.
లీడర్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఈ బహుమతులను గెలుచుకోగలరు.ఇప్పుడు, విజేతలలో ఒకరు తన బహుమతిని ఈబే యూకేలో విక్రయించాలని నిర్ణయించుకున్నారు.దీని ధరను 1,63,000 డాలర్లు (రూ.1.3 కోట్లు)గా కోట్ చేశారు.సాధారణంగా ప్రైమ్ హైడ్రేషన్ బాటిల్ 2.50, 3 డాలర్ల మధ్య ఖర్చవుతుంది.కానీ ఈవెంట్‌లో గెలుపొందిన ఈ ప్రత్యేకమైన ఫోర్ట్‌నైట్ రెడ్ వర్సెస్ బ్లూ బాటిల్స్ సాధారణ ధర కంటే దాదాపు 20,000 రెట్లకు అమ్ముడవుతున్నాయి.
ఈ వేలంలో ఒక్కో బాటిల్ వాల్యూ దాదాపు 54,600 డాలర్లు.

ఈబే లిస్టింగ్‌లో రెడ్ వర్సెస్ బ్లూ ప్రైమ్ బాటిల్స్ మాత్రమే కాకుండా, ఫుల్, సీల్డ్, అధికారిక ప్రైమ్ బ్యాగ్ ( Full, sealed, official prime bag )కూడా ఉన్నాయి.ఫోర్ట్‌నైట్ ఎక్స్ ప్రైమ్ ఈవెంట్‌లో 100,000 మంది ఇతర పోటీదారులను ఓడించి ఈ ఐటెమ్స్‌ను గెలుచుకున్నట్లు విక్రేత పేర్కొన్నాడు.ఈ వేలం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమయ్యింది.
సోషల్ మీడియాలో, ప్రజలు డ్రింక్ గురించి, ఈ బాటిళ్లను ఇంత ఎక్కువ ధరకు విక్రయించడం గురించి వివిధ అభిప్రాయాలను పంచుకున్నారు.కొందరు డ్రింక్ రుచిని అంత విలువైనది కాదని అన్నారు, మరికొందరు ఈ బాటిళ్లను కలెక్టబుల్స్‌గా చూసారు, ఇది ఫోర్ట్‌నైట్ కమ్యూనిటీ విలువైన గేమింగ్ చరిత్రలో భాగం.

వీడియో గేమ్ కంపెనీ విడుదల చేసిన డ్రింక్ బాటిల్ చాలా ఖరీదైనది అవడం హాట్ టాపిక్ గా మారింది.కొంతమంది ఈ ధర చాలా ఎక్కువ అని, కొనుగోలు చేయడం అనవసరం అని అభిప్రాయపడ్డారు.మరికొందరు ఆ పానీయం రుచి ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కానీ, ఈ ధర వెనుక మార్కెటింగ్ వ్యూహం కూడా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.ఈ బాటిల్స్ కేవలం పానీయం కోసం మాత్రమే కాకుండా, ఒక గేమింగ్ సంస్కృతిని సూచిస్తాయని వారు అంటున్నారు.







