సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభ్యర్థి( Secunderabad Cantonment Candidate ) ఎంపికపై తెలంగాణ బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది.కాంగ్రెస్, బీఆర్ఎస్( Congress,BRS ) అభ్యర్థులకు ధీటుగా బలమైన అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తుంది.
ఇప్పటికే ముగ్గురు పేర్లను బీజేపీ( BJP ) రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపింది.కాగా కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి రేసులో కొప్పు భాష, ఓం ప్రకాశ్ మరియు వంశీ తిలక్ ఉన్నారు.
రానున్న రెండు, మూడు రోజుల్లో వీరిలో నుంచి ఒకరిని అభ్యర్థిగా పార్టీ హైకమాండ్ ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బరిలో దిగిన శ్రీ గణేశ్( Sri Ganesh ) కాంగ్రెస్ గూటికి చేరారన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలో దిగనుండగా.బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా నివేదిత పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.







