అమెరికాకి హిందువులు, హిందూ మతం చేసిన సేవలను పురస్కరించుకుని ప్రముఖ భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీథానేదర్( Congressman Shri Thanedar ) ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.హిందూఫోబియా, హిందూ వ్యతిరేక మతోన్మాదం, ద్వేషం, అసహనాన్ని ఖండిస్తూ ఆయన ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
బుధవారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ఆయన పర్యవేక్షణ, జవాబుదారీతనంపై ఏర్పాటు చేసిన హౌస్ కమిటీకి సిఫారసు చేశారు.అమెరికాకు సహకరిస్తున్నప్పటికీ.
హిందూ అమెరికన్లు( Hindu Americans ) తమ వారసత్వం, చిహ్నాల గురించి మూస పద్ధతులను, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొంటారని శ్రీథానేదర్ అన్నారు.పాఠశాలలు, కళాశాలల క్యాంపస్‌లలో ద్వేషపూరిత ప్రసంగం, పక్షపాతానికి గురి అవుతున్నారని తీర్మానంలో ఆయన పేర్కొన్నారు.
ఎఫ్‌బీఐ హేట్ క్రైమ్ స్టాటిస్టిక్స్( FBI Hate Crime Statistics ) రిపోర్ట్ ప్రకారం.మందిరాలు , వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హిందూ వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు ఏటా పెరుగుతున్నాయి.
అయితే అమెరికన్ సమాజంలో సమాంతరంగా హిందూఫోబియా దురదృష్టవశాత్తూ పెరుగుతోందని తీర్మానం పేర్కొంది.విభిన్న జాతి, భాష నేపథ్యాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అమెరికా 1900ల నుంచి ప్రపంచం నలుమూలల నుంచి 4 మిలియన్లకు పైగా హిందువులను( Hindus ) స్వాగతించిందని శ్రీథానేదర్ అన్నారు.ప్రతి అంశంలోనూ హిందూ అమెరికన్ల సహకారంతో దేశం ఎంతో ప్రయోజనం పొందిందని తీర్మానం పేర్కొంది.కాగా.కొద్దిరోజుల క్రితం అమెరికాలోని ఐదుగురు భారతీయ సంతతికి చెందిన చట్టసభ సభ్యులు దేశంలోని హిందూ దేవాలయాలపై చోటు చేసుకుంటున్న దాడులపై జరుగుతున్న దర్యాప్తుపై స్టేటస్ సమాచారం కోరుతూ న్యాయశాఖలోని పౌర హక్కుల విభాగానికి లేఖ రాశారు.ఈ లేఖను యూఎస్ ప్రతినిధుల సభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి రాయగా.
మరో నలుగురు భారత సంతతి కాంగ్రెస్ సభ్యులు శ్రీథానేదర్, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీబెరాలు సంతకం చేశారు.హిందూ అడ్వకేసీ గ్రూప్ ‘‘ హిందూ అమెరికన్ ఫౌండేషన్ ( HAF ) ఈ లేఖ కాపీని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హిందూ మందిరాలు సహా దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాల్లో విధ్వంసకర సంఘటనలు పెరుగుతుండటాన్ని తాము గమనించామని వారు లేఖలో పేర్కొన్నారు.
న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు మందిరాలపై దాడులు( Attack on Temples ) హిందూ అమెరికన్లలో సామూహిక ఆందోళనను పెంచాయని కాంగ్రెస్ సభ్యులు ప్రస్తావించారు.దీని కారణంగా కమ్యూనిటీ సభ్యులు భయం, బెదిరింపులతో జీవితాన్ని కొనసాగిస్తున్నారని భారత సంతతి చట్టసభ సభ్యులు తెలిపారు.ఈ పక్షపాత, ప్రేరేపిత నేరాలకు సంబంధించి చట్ట అమలు సమన్వయం గురించి మా కమ్యూనిటీలు ఆందోళన చెందుతున్నాయి.
చట్టం ప్రకారం సమాన రక్షణను నిర్ధారించడానికి తగిన ఫెడరల్ పర్యవేక్షణ వుందా అని వారు ప్రశ్నించారు.అమెరికాలోని అన్ని మత , జాతి, సాంస్కృతిక మైనారిటీలపై ద్వేషాన్ని ఎదుర్కోవడానికి తాము సహకారంతో పనిచేయాలని భారత సంతతి నేతలు పేర్కొన్నారు.