పిల్లలు నాకే కావాలంటూ ధనుష్ కు భారీ షాకిచ్చిన ఐశ్వర్య.. ఆయన అంగీకరిస్తారా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్( Aishwarya Rajinikanth-Dhanush ) ల గురించి మనందరికీ తెలిసిందే.సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్య రజనీకాంత్ హీరో ధనుష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

 Aishwarya To Take Primary Custody Of Kids Instead Of Dhanush, Aishwarya Rajinika-TeluguStop.com

పెళ్లయి 18 ఏళ్లకు పైగా కలిసి ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకొని విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.గత రెండేళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు.

తాజాగా ధనుష్, ఐశ్వర్య చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఈలోగా పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న తలెత్తింది.

Telugu Dhanush, Kollywood, Linga Childrens, Yatra-Movie

దాదాపు 18 ఏళ్లకు పైగా కలిసున్న ఈ జంట ఉన్నట్టుండి సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు.ధనుష్ , ఐశ్వర్య విడిపోతున్నారంటే చాలా మంది నమ్మలేకపోయారు.విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత ఇద్దరు బిజీగా మారిపోయారు.హీరోగా ధనుష్ సినిమాలు చేస్తుంటే ఐశ్వర్య దర్శకురాలిగా సినిమాలు చేస్తున్నారు.ఇక ఇప్పుడు పిల్లల బాధ్యత గురించి ఆసక్తికర విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.పిల్లల బాధ్యతను ఐశ్వర్య పంచుకునే అవకాశం ఉందని అంటున్నారు.

పిల్లలను పోషించే బాధ్యత తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఐశ్వర్య.

Telugu Dhanush, Kollywood, Linga Childrens, Yatra-Movie

అయితే పిల్లల బాధ్యత పై ఇద్దరూ ఒక క్లారిటీతో ఉన్నారట.ఈ క్రమంలోనే ఐశ్వర్య తనకు పిల్లల బాధ్యతను అప్పగించాలని కోరిందట.దానికి ధనుష్ కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది.

ఐశ్వర్య రజనీకాంత్ చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్నారు.ఐశ్వర్య తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం 3 మూవీలో ధనుష్ హీరోగా నటించాడు.

ఈ దంపతులకు యాత్ర, లింగ( Yatra , Linga ) అనే పిల్లలు ఉన్నారు.మొదటి కొడుకు యాత్రకు 18 ఏళ్లు.

ధనుష్, ఐశ్వర్య విడిపోవడానికి కారణం ఇంకా వెల్లడించలేదు.ఐశ్వర్య సినిమా డైరెక్షన్‌లో బిజీగా ఉంది.

నటుడు ధనుష్ వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు.తెలుగు, తమిళ్ , హిందీ బాషాలతో పాటు హాలీవుడ్ లోనూ నటించారు ధనుష్.

మరి పిల్లల విషయంలో ధనుష్ ఐశ్వర్యలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube