కొత్తదనాలకు స్వాగతం చెబుతూ హిందువులు ఎంతో ఆనందంగా జరుపుకుంటే పండుగ ఉగాది.ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ( Ugadi festival ) వస్తుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 9న ఉగాది వచ్చింది.తెలుగు సంవత్సరాదిలో ఉగాదిని నూతన సంవత్సర దినంగా నిర్వహించుకుంటారు.
పురాణాల ప్రకారం.బ్రహ్మ సృష్టి ఉగాది రోజు నుండే మొదలు పెట్టారని అంటారు.
అలాగే ఉగాది అనగానే మనందరికీ మొదట గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి.షడ్రుచుల కలయికే ఉగాది పచ్చడి.
ఈ పచ్చడిని కేవలం ఉగాది రోజు మాత్రమే చేసుకుంటారు.షడ్రుచులు ఒక వ్యక్తి యొక్క భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది.
షడ్రుచులు అంటే.తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు.
ఈ ఆరు రుచులు కలిగి ఉన్న బెల్లం, చింతపండు, ఉప్పు, వేప, కారం, మామిడికాయ ముక్కలతో ఉగాది పచ్చడి చేస్తాయి.
సాంప్రదాయంగా చేసే ఉగాది పచ్చడితో అంతులేని ఆరోగ్య లాభాలు( Health benefits ) ఉన్నాయి.
ఉగాది పచ్చడిలో చేదు కోపం వేప పువ్వును వాడతారు.వేప పువ్వులో ఎన్నో పోషకాలు మరియు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
వేప పువ్వు( Neem flower ) రక్తాన్ని శుద్ధి చేస్తుంది.శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
వేప పువ్వు జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది.బుతుమార్పు వల్ల పిల్లల్లో వచ్చే ఆటలమ్మ, స్పోటకం, కలరా, మలేరియా సోకకుండా వేప పువ్వు రక్షిస్తుంది.
![Telugu Tips, Latest, Ugadi, Ugadipachadi-Telugu Health Telugu Tips, Latest, Ugadi, Ugadipachadi-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2024/04/Incredible-health-benefits-of-ugadi-pachadi-ugadi-pachadib.jpg)
అలాగే ఉగాది పచ్చడితో వగరు రుచి కోసం మామిడి ముక్కలను( Mango slices ) ఉపయోగిస్తారు.మామిడి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.మధుమేహం ముప్పు తగ్గిస్తుంది.రక్తపోటును అదుపులో ఉంచుతుంది.ఉగాది పచ్చడిలో పులుపు కోసం వాడే చింతపండులో మన ఆరోగ్యానికి సహాయపడే అనేక పోషకాలు ఉంటాయి.చింతపండులోని ఫ్లేవనాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి.
గుండె ఆరోగ్యానికి ప్రోత్సహిస్తాయి.చింతపండు చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
అదే సమయంలో అదనపు సెబమ్ ఉత్పత్తిని సైతం తగ్గించి మెరిసే చర్మాన్ని అందిస్తుంది.
![Telugu Tips, Latest, Ugadi, Ugadipachadi-Telugu Health Telugu Tips, Latest, Ugadi, Ugadipachadi-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2024/04/Incredible-health-benefits-of-ugadi-pachadi-ugadi-pachadic.jpg)
ఉగాది పచ్చడిలో తీపి కోసం బెల్లం వాడతారు.బెల్లం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.అలసట దరి చేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.
బెల్లంలో ఐరన్ కంటెంట్ రక్తహీనతను దూరం చేస్తుంది.బెల్లం కాలేయ పనితీరును పెంచుతుంది.
ఉప్పు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.శరీరంలోని కణాలు సక్రమంగా పని చేసేందుకు.
ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడేందుకు ఉప్పు తోడ్పడుతుంది.ఇక మిరపకారం మన ఇంద్రియాలన్నిటి లోని మలినాలను బయటకు పంపిస్తుంది.
గొంతు వ్యాధులను తగ్గించేందుకు కూడా కారం హెల్ప్ చేస్తుంది.అందుకు ఉగాది రోజు తయారు చేసే ఉగాది పచ్చడిని అస్సలు మిస్ అవ్వకండి.