షాంపూలో కాఫీ పౌడర్ కలిపి వాడటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

కాఫీ( Coffee ) .ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాలు ఒకటి.

 Do You Know The Benefits Of Using Coffee Powder In Shampoo Coffee Powder, Coffee-TeluguStop.com

ముఖ్యంగా ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.కోట్లాది మందికి కాఫీతో విడదీయలేని సంబంధం ఏర్పడింది.

మితంగా తీసుకుంటే కాఫీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి.అదంతా పక్కన పెడితే.

జుట్టు సంరక్షణకు కాఫీ పౌడర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా షాంపూలో కాఫీ పౌడర్ కలిపి వాడటం వల్ల ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చ‌ని అంటున్నారు.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) ను వేసుకోవాలి.అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు రెగ్యుల‌ర్ షాంపూ మరియు రెండు గ్లాసులు వాటర్ పోసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా కాఫీ పౌడర్ ను వాడటం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు.

Telugu Coffeepowder, Benefitscoffee, Care, Care Tips, Healthy, Latest, Shampoo,

కాఫీలో ఉండే కెఫిన్ ( Caffeine ) జుట్టు పెరుగుదలను ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది.అవును, కెఫీన్ మీ నెత్తికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.పెరిగిన రక్త ప్రసరణ జుట్టు మూలాలకు పోషకాలను తరలించడంలో సహాయపడుతుంది.ఫ‌లితంగా మీ జుట్టు వేగంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుంది.అలాగే కాఫీ పౌడర్ జుట్టు రాలడాన్ని అరికడుతుందని అధ్యాయాలు చెబుతున్నాయి.

Telugu Coffeepowder, Benefitscoffee, Care, Care Tips, Healthy, Latest, Shampoo,

అంతేకాకుండా పొడి, పెళుసు మరియు నిర్జీవమైన జుట్టు రూపాన్ని మెరుగుపరచడంలో కాఫీ పౌడర్ హెల్ప్ చేస్తుంది.కాఫీ పౌడ‌ర్ ఫ్లేవనాయిడ్స్‌ను క‌లిగి ఉంటుంది.ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు సహజమైన హెయిర్ కండీషనర్‌గా పనిచేయడమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో తోడ్ప‌డ‌తాయి.

కాఫీ పౌడర్ జుట్టును మృదువుగా మరియు షైనీ గా మెరిపిస్తుంది.అదనపు సెబమ్‌ను తొలగిస్తుంది.ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ను ప్రోత్సహిస్తుంది.మరియు తెల్ల జుట్టుకు సైతం చెక్ పెడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube