నటసింహం నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక అందులో భాగంగానే ఇప్పుడు బాబి డైరెక్షన్ లో ఎన్.
బి.కె 109 సినిమా( NBK 109 movie ) చేస్తున్నాడు.ఈ సినిమాలో బాలయ్య మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక బాబీ మాస్ సినిమాలను డైరెక్ట్ చేయడంలో సిద్ధహస్తుడు కాబట్టి ఈ సినిమాని కూడా చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇంతకుముందే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు.దాంతో బాలయ్య బాబు అభిమానులకు కిక్ ఎక్కించే విధంగా గ్లిమ్స్ ఉండటం తో ఈ సినిమా మీద అభిమానులతో పాటుగా సగటు ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు తన వందోవ సినిమాగా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా( Gautami Putra Satakarni movie ) చేశారు.అయితే దీనికంటే ముందే ఒక స్టార్ డైరెక్టర్ తో తన వందో సినిమాను చేయాలనుకున్న బాలయ్య ఆ సబ్జెక్ట్ ని ఆపేసి క్రిష్ తో గౌతమిత్ర శాతకర్ణి సినిమాని తెరకెక్కించాడు.అయితే నిజానికి బాలయ్య 100వ సినిమా సింగీతం శ్రీనివాసరావు ( Singeetham Srinivasa Rao )డైరెక్షన్ లో ఆదిత్య 999( Aditya 999 ) అనే సినిమాని తెరకెక్కించాలని చూశారు.ఇది ఆదిత్య 369 సినిమాకి సిక్వల్ గా తెరకెక్కనుంది.
అయితే ఈ ప్రాజెక్టుని బాలయ్య క్యాన్సిల్ చేసి క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇక మొత్తానికైతే బాలయ్య బాబు తన వందో సినిమా కోసం గ్రాండ్ గా ఒక సక్సెస్ ఫుల్ సినిమాను చేయడం అనేది ఒక మంచి విషయం అనే చెప్పాలి.ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు వరుసగా సూపర్ హిట్లు అవ్వడం తో హ్యాట్రిక్ హిట్లు కూడా నమోదు చేసుకున్నాడు…
.