యూట్యూబ్ ఛానెళ్లతో రూ.కోట్లు సంపాదిస్తున్న ప్రముఖ యూట్యూబర్లు వీళ్లే.. గ్రేట్ అంటూ?

ప్రస్తుతం మన దేశంలోని చాలామంది యూట్యుబ్ ఛానెళ్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయితే లక్షల రూపాయల ఆదాయం వస్తుందనే సంగతి తెలిసిందే.

 These Youtubers Earning Crores With Youtube Channels Details Here Goes Viral-TeluguStop.com

అయితే కొంతమంది యూట్యూబర్లు మాత్రం యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన సందర్భాలు సైతం ఉన్నాయి.మన దేశంలో క్యారిమినాటీ అనే యూట్యూబ్ ఛానెల్ కు ఏకంగా 4 కోట్ల మందికి పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

ఈ యూట్యూబ్ ఛానల్ ఓనర్ పేరు అజయ్ నాగర్( Ajey Nagar ) కాగా పదేళ్లకే గేమింగ్ వీడియోలతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన అజయ్ 50 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది.మహారాష్ట్రకు చెందిన అశిష్ చంచ్లానీ “అశిష్ చంచ్లానీ వైన్స్” పేరుతో యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టాడు.

తమాషా మాటలతో నవ్వు పుట్టించే కాన్సెప్ట్ లతో అశిష్ సబ్ స్క్రైబర్లను పెంచుకున్నారు.

Telugu Ajey Nagar, Amit Bhadana, Bhuvan Bam, Nisha Madhulika, Youtubers-Inspirat

ఇతని ఆస్తుల విలువ ఏకంగా 41 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ఢిల్లీకి చెందిన భువన్ పాటల రచయితగా, గాయకుడిగా, నటుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.భువన్ ( Bhuvan Bam )ఆస్తుల సంపాదన 122 కోట్ల రూపాయలు కాగా ఫ్యాషన్ దుస్తుల కంపెనీలకు భువన్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

రాజస్థాన్ కు చెందిన గౌరవ్ చౌధురి 32 ఏళ్ల వయస్సులో టెక్నికల్ గురూజీగా మారారు.ఇతనికి రెండున్నర కోట్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.ఇతని ఆస్తుల విలువ 350 కోట్ల రూపాయలు.

Telugu Ajey Nagar, Amit Bhadana, Bhuvan Bam, Nisha Madhulika, Youtubers-Inspirat

> 30 సంవత్సరాల వయస్సు ఉన్న అమిత్ భడానా( Amit Bhadana )కు సైతం 2.5 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.ఇతని ఆదాయం 50 కోట్ల రూపాయలు అని భోగట్టా.

యూపీకి చెందిన నిశా మధులిక( Nisha Madhulika ) కుకింగ్ వీడియోల యూట్యూబ్ ఛానల్ తో ఏకంగా 43 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.ఆమె వయస్సు 64 సంవత్సరాలు కావడం గమనార్హం.

ఈ యూట్యూబర్లు పేరుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube