తెలుగులో హిట్టైన ఆ సినిమా రీమేకైన ప్రతిచోటా బంపర్‌హిట్‌!

ఒక సినిమా బ్లాక్‌బస్టర్‌ అయిందంటే దాని వెనుక ఎంతో శ్రమ, మరెన్నో కథలు ఉంటాయి.2006లో వచ్చిన ‘పోకిరి’ సినిమా( Pokiri Movie ) అలాంటిదే.సూపర్‌ స్టార్‌ మహేష్‌,( Mahesh Babu ) పూరి జగన్నాథ్‌ ( Puri Jagannadh ) ఫస్ట్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సృష్టించిన బజ్ అంతాఇంతా కాదు.కలెక్షన్ల పరంగా అప్పటికి కొత్త రికార్డులు సృష్టించింది.

 Facts About Mahesh Babu Puri Jagannadh Pokiri Movie Details, Mahesh Babu, Puri-TeluguStop.com

అయితే ఈ సినిమా వెనుక ఎన్నో ఇంట్రెస్టింగ్‌ అంశాలు ఉన్నాయి.అవేమిటో ఇపుడు తెలుసుకుందాం.

అప్పటికి వరస విజయాలతో దూసుకెళ్తున్న పూరికి ‘ఆంధ్రావాలా’ బ్రేక్ ఇచ్చింది.దాంతో బద్రి టైమ్‌లోనే రాసుకున్న ‘ఉత్తమ్‌సింగ్‌ సన్నాఫ్‌ సూర్యనారాయణ’ స్క్రిప్ట్‌ని బయటికి తీశాడు.

ఆ కథ విని రవితేజ చాలా ఎక్సైట్‌ అయ్యాడు.అయితే అదే టైమ్‌లో రవితేజకు ‘ఆటోగ్రాఫ్‌’ చేసే మంచి ఛాన్స్‌ రావడంతో ఈ విషయం పూరికి చెప్పి ఆ ప్రాజెక్ట్‌కి షిప్ట్‌ అయిపోయాడు.

Telugu Ileana, Mahesh Babu, Pokiri, Prabhudeva, Puri Jagannadh, Salman Khan, Vij

తరువాత ఏం చేయాలో పూరీకి అర్ధం కాలేదు.ఒక దశలో బాలీవుడ్‌ యాక్టర్‌ సోనుసూద్‌తో ఉత్తమ్‌సింగ్‌ సినిమా చెయ్యాలనుకున్నాడు.కానీ, కుదరలేదు.అదే సమయంలో 2004లో తాజ్‌ హోటల్‌లో పూరి, మహేష్‌ కలిశారు.అంతకు మూడేళ్ళ క్రితం మహేష్‌కి ‘ఇడియట్‌’ కథ చెప్పగా అది మహేష్‌కి నచ్చలేదు.ఈసారి ఉత్తమ్‌సింగ్‌( Uttam Singh ) కథ చెప్పి మహేష్‌ని మెప్పించాడు.

నెక్స్‌ట్‌ ఇయర్‌ స్టార్ట్‌ చేద్దాం అంటూ సిఖ్‌ బ్యాక్‌డ్రాప్‌ మార్చమని, అదేవిధంగా ఉత్తమ్‌సింగ్‌ టైటిల్‌ మార్చమని మహేష్‌ కోరగా వెంటనే ‘పోకిరి’ టైటిల్‌ చెప్పాడు పూరి.ప్రాజెక్ట్‌ ఓకే అయిపోయింది.

ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ తరువాయి.మొదట అయేషా టకియా, దీపిక పదుకొనే, పార్వతి మెల్టన్‌.

ఇలా చాలా మందిని అనుకున్నారు.కానీ ఇలియానా( Ileana ) ఫిక్స్‌ అయింది.

‘పోకిరి’ షూటింగ్‌ స్టార్ట్‌ అయింది.ప్రతి షాట్‌ని సింగిల్‌ టేక్‌లోనే ఓకే చేసేవాడు పూరీ.70 రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది.

Telugu Ileana, Mahesh Babu, Pokiri, Prabhudeva, Puri Jagannadh, Salman Khan, Vij

సరిగా 2006 ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిందనే విషయం అందరికీ తెలిసినదే.తెలుగులో అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ ఈ సినిమా చెల్లా చెదురు చేసింది.‘పోకిరి’ మహేష్‌కి స్టార్‌డమ్‌ తీసుకొస్తే పూరిని టాప్‌ డైరెక్టర్‌ని చేసింది.

సినిమాలోని ప్రతి సీన్‌ పేలింది.డైలాగులు, యాక్షన్‌ సీన్స్‌, అలీ, వేణుమాధవ్‌, బ్రహ్మాంనందం కాంబినేషన్‌లో రూపొందిన బెగ్గర్స్‌ సీన్స్‌ థియేటర్‌లో అదిరిపోయాయి.

కట్ చేస్తే 75 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఏ సినిమా కూడా సాధించన రికార్డులు ‘పోకిరి’ సాధించింది.దాంతో ఇతర భాషా హీరోగా కన్ను ఈ సినిమాపైన పడింది.

అలా 2007లో విజయ్‌( Hero Vijay ) హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తమిళ్‌లో విడుదలై అక్కడ కూడా ఘనవిజయం సాధించింది.అదేవిధంగా 2009లో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్‌లోనే ‘వాంటెడ్‌’( Wanted Movie ) పేరుతో రీమేక్‌ చేస్తే బాలీవుడ్‌లో కూడా బిగ్‌ హిట్‌గా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube