స్టార్ హీరో బాలకృష్ణకు( Balakrishna ) ఈ మధ్య కాలంలో అతని కష్టానికి అదృష్టం తోడవుతోంది.బాలయ్య నటించిన ప్రాజెక్ట్ లు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటున్నాయి.
నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తూ ఆదు పదుల వయస్సులో సైతం వరుస ఆఫర్లను అందుకుంటున్న బాలయ్య యంగ్ జనరేషన్ స్టార్స్ కు సైతం షాకిస్తున్నారు.పారితోషికం పరంగా సైతం బాలయ్య ముందువరలోనే ఉన్నారు.
బాలయ్య ప్రస్తుతం హిందూపురం( Hindupuram ) అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఉండగా ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు.అయితే బాలయ్య ఇప్పటివరకు హిందూపురం నియోజకవర్గంలో అడుగు పెట్టలేదని తెలుస్తోంది.
షూటింగ్స్, ఇతర కార్యక్రమాలతో బాలయ్య బిజీగా ఉన్నారని భోగట్టా.హిందూపురం టీడీపీ( TDP ) కంచుకోట కాగా చాలా సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీనే విజయం సాధిస్తోంది.2019లో సీమలో జగన్ హవా ఉన్నా హిందూపురంలో బాలయ్య ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అయితే ఈ ఎన్నికల్లో విజయం పట్ల బాలయ్యది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.హిందూపురంలో వైసీపీ( YCP ) విజయం సాధించడం కోసం జగన్, వైసీపీ మంత్రులు ఎంతో కష్టపడుతున్నారు.బాలయ్య ఇకనైనా హిందూపురంలో ప్రచారం మొదలుపెడితే బాగుంటుందని నెటిజన్లు చెబుతున్నారు.
వైసీపీ తరపున హిందూపురం నుంచి దీపిక పోటీ చేయనుండగా ఆమె విజేతగా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.ఎన్నికల్లో గెలుపునకు సంబంధించి ఉన్న ఏ ఒక్క ఛాన్స్ ను కూడా వైసీపీ, టీడీపీ వదులుకోకుండా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం కష్టపడుతున్నారు.హిందూపురంలో ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించిన బాలయ్య హ్యాట్రిక్ పై ఆశలు పెట్టుకున్నారు.బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు.