ఈ మధ్యకాలంలో ఢిల్లీ( Delhi ) నగరం వద్ద ఉన్న నోయిడా ప్రాంతంలో ఓ వ్యక్తికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంకి 7 కోట్ల రూపాయలను బిల్ వేసిన ఉబర్ సంస్థ( Uber company )., ఆ విషయాన్ని మర్చిపోకముందే మరోసారి బెంగళూరు నగరంలో అలాంటి సంఘటన చోటు చేసుకుంది.
బెంగళూరు( Bangalore ) నగరంలో కేవలం 10 కిలోమీటర్ల దూరం ఆటో చార్జెస్ గాను హైదరాబాద్ కు చెందిన ఓ కస్టమర్ కి ఏకంగా కోటి రూపాయలకు పైగా బిల్లును వేసింది.దీన్ని చూసిన ఆటో డ్రైవర్, అలాగే కస్టమర్ ఇద్దరు షాక్ అయ్యారు.
అయితే ఈ సంఘటనను ఎదుర్కొన్న శ్రీరాజ్ నీలేష్( Sriraj Nilesh ) కస్టమర్ ద్వారా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ నగరానికి చెందిన శ్రీరాజ్ నీలేష్ తన పని నిమిత్తం బెంగళూరు నగరానికి వెళ్ళాడు.అయితే అతడు పనిమీద కేఆర్ పురంలోని టిన్ ఫ్యాక్టరీ ( Factory in KR Puram ) నుండి కోరమంగళకు వెళ్లాల్సి వచ్చింది.అందుకోసం అతడు ఉబర్ ద్వారా ఆటోను బుక్ చేసుకున్నాడు.బుక్ చేసుకున్న తర్వాత గమ్యస్థానానికి చేరిన తర్వాత వారిని చూస్తే రూ.1,03,11,055గా చూపించింది.
అయితే ఇదేదో సాంకేతిక లోపం అని గ్రహించిన కస్టమర్ వెంటనే కస్టమర్ కేర్ ని సంప్రదించగా వారు సరిగా స్పందించలేదు.దాంతో ఈ విషయంపై పూర్తి వివరాలను ఓ వీడియో రూపంలో రికార్డు చేసి దానిని సోషల్ మీడియాలో వదిలాడు.దాంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.