వైరల్ వీడియో: మరోసారి ఆటో ఛార్జీలను కోట్లలో చూపించిన ఉబర్..!

ఈ మధ్యకాలంలో ఢిల్లీ( Delhi ) నగరం వద్ద ఉన్న నోయిడా ప్రాంతంలో ఓ వ్యక్తికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంకి 7 కోట్ల రూపాయలను బిల్ వేసిన ఉబర్ సంస్థ( Uber Company ).

, ఆ విషయాన్ని మర్చిపోకముందే మరోసారి బెంగళూరు నగరంలో అలాంటి సంఘటన చోటు చేసుకుంది.

బెంగళూరు( Bangalore ) నగరంలో కేవలం 10 కిలోమీటర్ల దూరం ఆటో చార్జెస్ గాను హైదరాబాద్ కు చెందిన ఓ కస్టమర్ కి ఏకంగా కోటి రూపాయలకు పైగా బిల్లును వేసింది.

దీన్ని చూసిన ఆటో డ్రైవర్, అలాగే కస్టమర్ ఇద్దరు షాక్ అయ్యారు.అయితే ఈ సంఘటనను ఎదుర్కొన్న శ్రీరాజ్ నీలేష్( Sriraj Nilesh ) కస్టమర్ ద్వారా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / హైదరాబాద్ నగరానికి చెందిన శ్రీరాజ్ నీలేష్ తన పని నిమిత్తం బెంగళూరు నగరానికి వెళ్ళాడు.

అయితే అతడు పనిమీద కేఆర్ పురంలోని టిన్ ఫ్యాక్టరీ ( Factory In KR Puram ) నుండి కోరమంగళకు వెళ్లాల్సి వచ్చింది.

అందుకోసం అతడు ఉబర్ ద్వారా ఆటోను బుక్ చేసుకున్నాడు.బుక్ చేసుకున్న తర్వాత గమ్యస్థానానికి చేరిన తర్వాత వారిని చూస్తే రూ.

1,03,11,055గా చూపించింది. """/" / అయితే ఇదేదో సాంకేతిక లోపం అని గ్రహించిన కస్టమర్ వెంటనే కస్టమర్ కేర్ ని సంప్రదించగా వారు సరిగా స్పందించలేదు.

దాంతో ఈ విషయంపై పూర్తి వివరాలను ఓ వీడియో రూపంలో రికార్డు చేసి దానిని సోషల్ మీడియాలో వదిలాడు.

దాంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

నాని సినిమాకు మెాహన్ బాబు ప్లస్ అవుతాడా? మైనస్ అవుతాడా..?