బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) మధ్యంత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయింది.ఈ మేరకు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై( Interim Bail Petition ) విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 20వ తేదీన విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది.
అయితే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి.
తన కుమారుడికి పరీక్షలు ఉన్న కారణంగా కవిత మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.అయితే అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ( ED ) పేర్కొంది.
ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) తీర్పును రిజర్వ్ చేసింది.