పూరి జగన్నాథ్, రామ్ పోతినేని( Puri Jagannath , Ram Pothineni ) కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్( Double ismart ).ఈ సినిమా రూపొందుతోంది కానీ ఈ సినిమా పరిస్థితి ఏంటి అన్నది మాత్రం అభిమానులకు అర్థం కావడం లేదు.
ఎప్పుడు అప్ డేట్ వస్తుంది.ఎప్పుడు ఫస్ట్ సాంగ్ వస్తుంది.
అసలు ఎంత వరకు పూర్తయింది అన్నవి అన్నీ ప్రశ్నలే.వీటికి సమాధానాలు కూడా తెలుస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా 95 శాతం పూర్తయిందట.ముఖ్యంగా క్లయిమాక్స్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ పూర్తయ్యాయి.
రెండు పాటల పిక్చరైజేషన్( Picturization of two songs ) కూడా జరిగింది.ఇప్పుడు వర్క్ అంతా ఒక అయిదు నుంచి పదిశాతం మిగిలింది.రెండు లేదా మూడు పాటల చిత్రీ కరణ మిగిలింది.కానీ సమస్య ఏమిటంటే నాన్ థియేటర్ అమ్మకాలు జరగాల్సి వుంది.ముఖ్యంగా డిజిటల్ సేల్స్, హిందీ సేల్స్.కంటిన్యూగా సినిమాలు చేస్తూ, చేతిలో మూడు నాలుగు సినిమాలు వుండే బ్యానర్లు కాస్త పని జరిపించుకోగలుగుతున్నాయి.
కానీ పూరి బ్యానర్ లో వున్నది ఈ ఒక్క సినిమానే.ఇప్పటికే సినిమా మీద 50 నుంచి 60 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
నాన్ థియేటర్ అమ్మకాలు జరిగిపోతే, సినిమాను ఫినిష్ చేసి, విడుదలకు రెడీ చేస్తారు.నాన్ థియేటర్ సేల్స్ కాకుండా తొందరపడడం సరి కాదు.అందుకే పూరి వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది.ఇటీవల కొన్ని రోజులు హైదరాబాద్ లో వుండి వెళ్లిన పూరి, చార్మి కొన్ని పనులు చక్కబెట్టుకుని వెళ్లారు.నాన్ థియేటర్ బిజినెస్ మీద సీరియస్ గా వర్క్ చేస్తున్నారు.