యాదాద్రి భువనగిరి జిల్లా: యాసంగి పంట నష్టంపై స్వయంగా రైతులను కలుసుకునేందుకు జనగామ,ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో బుధవారం మాజీ సిఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన ముగించుకుని యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా కేసిఆర్ కు గులాబీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
యాదాద్రి జిల్లాలోని పలు మండలాలు సందర్శించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ బస్సు భువనగిరికి చేరుకోగానే మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి బస్సులో ఎక్కారు.
ఆ జిల్లా పర్యటన ముగించుకొని కేసీఆర్ సూర్యాపేట జిల్లాల్లోకి ప్రవేశించారు.







