ఇప్పుడు ఎటువైపు చూసిన ప్రభాస్( Prabhas ) నటిస్తున్న కల్కి చిత్రం లేదంటే రాజా సాబ్ గురించి చర్చ జరుగుతుంది.ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో వీటి గురించిన ప్రస్తావన సోషల్ మీడియాలో మరియు మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) తీయబోతున్న స్పిరిట్( Spirit Movie ) గురించి ఎక్కడ వార్తలు రావడం లేదు.
ప్రభాస్ ని ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తాను అంటూ సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే అనౌన్స్ చేశాడు.అలాగే దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
దాంతో ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా అప్డేట్స్ గురించి ఎదురు చూస్తున్నారు.అయితే దీనికి సంబంధించిన వార్తలు సందీప్ ఎలాంటి లీక్ ఇవ్వక పోవడంతో చాలామంది అసలు సినిమా ఉంటుందా లేదా అనే అనుమానంలో ఉన్నారు.
కానీ సందీప్ రెడ్డి వంగా కచ్చితంగా తన ఆనిమల్ సినిమా తర్వాత చేయబోయేది స్పిరిట్ అని తెలుస్తోంది.అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు ( Prabhas Birthday ) సందర్భంగా సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదా ఒక లుక్ ఏదైనా విడుదల చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.పైగా ప్రభాస్ కూడా ఇప్పుడు రాజా సాబ్( Rajasaab ) మరియు కల్కి ( Kalki ) సినిమాలను చాలా వేగంగా పూర్తి చేయాలి అనుకుంటున్నాడు ఎన్నికల నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడుతోంది అని అందరూ భావించిన అందుకు తావు లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన పనుల్లో బిజీ గా ఉన్నాయి ఈ రెండు చిత్రాల యూనిట్స్.
ఇక ప్రభాస్ స్పిరిట్ సినిమాకు హీరోయిన్ గా కీర్తి సురేష్, మ్రుణాల్ ఠాకూర్, రష్మిక మందన్న పేర్లని కూడా పరిశీలిస్తున్నారట.స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ ఆధ్వర్యంలో మేకోవర్ చేయించుకుంటున్నాడట.అలాగే దసరా కానుక గా 2025 లో ఈ సినిమా విడుదల చేయాలని సందీప్ రెడ్డి వంగా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తోంది.
మరి అందరి అంచనాలు ఒకే అయి ఈ సినిమా 2025 దసరాకి వస్తే అంతకన్నా సంతోషం ఏమి ఉంటుంది చెప్పండి.