తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) జోరు మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది.ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది.
ఇప్పటికే బీఆర్ ఎస్ కు చెందిన అనేకమంది కీలక నాయకులు , ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కేసిఆర్ కు అత్యంత సన్నిహితులైన వారు ఇలా ఎంతోమంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు .ఈ చేరికలు తంతు ముందు ముందు ఇదేవిధంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
రాబోయే లోక్ సభ ఎన్నికలను( Lok Sabha Elections ) దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసి , మెజార్టీ ఎంపీ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఉంది.ఇక నిన్న ఒక్కరోజే జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ,( Gadwal Vijayalakshmi ) మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ తో పాటు ఎంతోమంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఇంకా ఐదుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా తెలంగాణ టిడిపిలో కీలకంగా ఉన్న నందమూరి సుహాసిని( Nandamuri Suhasini ) కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం .నిన్న సీఎం రేవంత్ రెడ్డితో( CM Revanth Reddy ) సుహాసిని భేటీ అయ్యారు.తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షి, రేవంత్ కు సుహాసిని పుష్పగుచ్చం అందజేశారు .సుహాసిని తో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , మంత్రి కొండ సురేఖ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సైతం ఉన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు సుహాసిని సిద్ధంగా ఉన్నారని అందుకే రేవంత్ తో కలిసి చేరిక విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది .వచ్చే ఎన్నికల్లో దాదాపు 15 సీట్లలో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే చేరికలను మరింతగా ప్రోత్సహిస్తున్నారు.
జూబ్లీహిల్స్ , కూకట్ పల్లి , ఖైరతాబాద్ పరిధిలో నందమూరి సుహాసిని కి విస్తృతంగా పరిచయాలు ఉండడంతో , ఆమెను చేర్చుకుంటే కాంగ్రెస్ కు కలిసి వస్తుందని లెక్కల్లో రేవంత్ ఉన్నారు.ఇక కాంగ్రెస్ లో చేరిన తరువాత కీలక పదవి ఇచ్చేందుకు కూడా ఆ పార్టీ అధిష్టానం సిద్దంగా ఉందట.ఎమ్మెల్సీ ఇవ్వడమో లేదా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయించి జిహెచ్ఎంసి మేయర్ పదవి ఇచ్చేందుకు అయినా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.