Oversleeping : అమ్మాయిలు అతిగా నిద్ర‌పోతున్నారా.. అయితే అందులో వీక్ అవుతారు జాగ్ర‌త్త‌!

మన బాడీ మరియు మైండ్ హెల్తీ గా, ఫిట్ గా ఉండటానికి కావాల్సిన అతి ముఖ్యమైన వనరుల్లో నిద్ర ముందు వరుసలో ఉంటుంది.ఆహారం లేకపోయినా కొద్ది రోజులు జీవించవచ్చు.

 Side Effects Of Oversleeping In Women-TeluguStop.com

కానీ నిద్ర లేకపోతే మాత్రం మనిషి చాలా త్వరగా అలసిపోతాడు.శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా నిద్ర( Sleeping ) ఎంతో అవసరం.

కంటి నిండా నిద్ర ఉండడం వల్ల 90 శాతం రోగాలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.నిద్ర వల్ల మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి.

అలాగే నష్టాలు కూడా ఉన్నాయి.ఒక రోజులో మనిషికి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం.

కానీ కొందరు పది నుంచి 12 గంటల పాటు నిద్రపోతుంటారు.అయితే కంటి నిండా నిద్ర లేకపోవడం ఎంత ప్రమాదకరమో అతిగా నిద్ర పోవడం కూడా అంతే ప్రమాదకరం.

Telugu Tips, Latest, Effects-Telugu Health

అతిగా నిద్ర పోవడం( Oversleeping ) వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.ముఖ్యంగా అమ్మాయిలు అతిగా నిద్ర పోవడం చాలా డేంజర్ అని అంటున్నారు.ఆడవారికి కచ్చితంగా 8 గంటల పాటు నిద్ర ఉండాలి.కానీ అంతకు మించి నిద్రించడం వల్ల గర్భం దాల్చడం లో వీక్ అవుతారని ఓ అధ్యయనంలో తేలింది.7 లేదా 8 గంటలు నిద్రపోయే మహిళలతో ( Women )పోలిస్తే.9 లేదా 11 గంటలు నిద్రపోయే ఆడవారు గర్భం దాల్చే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు క‌నుగొన్నారు.అతిగా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల హార్మోన్లు( Hormones ) అస్తవ్యస్తంగా మార‌తాయి.ఈ కార‌ణంగా గ‌ర్భం దాల్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి.అలాగే ఆడవారి కాకుండా అతిగా పడుకోవడం వల్ల మగవారు కూడా ఎఫెక్ట్ అవుతారు.తొమ్మిది నుంచి 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రించడం వల్ల సోమరితనం గా మారతారు.

Telugu Tips, Latest, Effects-Telugu Health

వెయిట్ గెయిన్ అవుతారు మధుమేహం( Diabetes ) వచ్చే రిస్క్ రెండు శాతం పెరుగుతుంది.అంతే కాకుండా ఓవ‌ర్ గా నిద్రపోయే వారిలో ఒత్తిడి స్థాయిలు ఎక్కువగా ఉంటాయని.డిప్రెషన్ బారిన పడే అవకాశాలు అధికమని పలు అధ్యయనాలు తేల్చాయి.అతిగా నిద్రించడం వల్ల మెదడు ప‌నితీరు సైతం నెమ్మదిస్తుంది.కాబట్టి మీ శరీరానికి ఎంత రెస్ట్ అవసరమో అంతే తీసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube