NRI Arrested : వన్యప్రాణి అవశేషాలను దేశం దాటించే యత్నం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎన్ఆర్ఐ అరెస్ట్

‘‘ wildlife trophy ’’ని (జంతువుల తల లేదా చర్మ భాగం) భారతదేశం నుంచి అక్రమంగా విదేశాలకు తరలించేందుకు ప్రయత్నించిన ప్రవాస భారతీయుడిని( NRI ) ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు పోలీసులు.నిందితుడిని పాల్‌జిత్ సింగ్ లాల్వాణిగా( Paljit Singh Lalvani ) గుర్తించారు.

 Nri Arrested At Indira Gandhi International Airport For Trying To Smuggle Wildl-TeluguStop.com

ఇతను మార్చి 24న అమెరికా వెళ్లే విమానం ఎక్కబోతుండగా.ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్( Indira Gandhi International Airport ) భద్రతా సిబ్బంది అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో అడ్డుకున్నారు.

‘‘ wildlife trophy ’’ అనేది వేటాడిన జంతువుకు చెందిన తల లేదా చర్మం వంటి ఏదైనా అవశేషం.పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం.

భారత్‌లోని వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ I, II కింద కవర్ చేయబడిన జంతువుగా జింకను భావిస్తారు.

Telugu Wildlife Trophy, Customs, Delhi Airport, Delhi, India, Indiragandhi, York

అటవీ, వన్యప్రాణుల శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్చి 26న అమెరికాలోని న్యూయార్క్‌లో( New York ) నివసిస్తున్న ఎన్ఆర్ఐ లాల్వాణిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఎయిర్‌పోర్టులో లాల్వాణి లగేజీని స్కాన్ చేయగా.అతని సూట్‌కేసుల్లో ఒకదానిలో అనుమానాస్పద వస్తువు కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.

అనంతరం లాల్వాణిని అరెస్ట్ చేసి అతనిపై తొలుత కస్టమ్స్ చట్టం 1962( Customs Act 1962 ) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే సూచనతో డ్యూటీ మేజిస్ట్రేట్, పాటియాలా హౌస్ కోర్ట్ ద్వారా కేసును వన్యప్రాణి విభాగానికి అప్పగించారు.

Telugu Wildlife Trophy, Customs, Delhi Airport, Delhi, India, Indiragandhi, York

సెక్షన్ 40 ప్రకారం .అవసరమైన అనుమతులు లేకుండా వన్యప్రాణులకు సంబంధించిన అవశేషాలను ఎగుమతి చేసే ఏ ప్రయత్నమైనా చట్ట ప్రకారం శిక్షార్హమైనదిగా ఎఫ్ఐఆర్ పేర్కొంది.వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని నిబంధనలు 39, 49, 51 కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించినట్లు ఢిల్లీ పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.లాల్వాణిని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచగా కస్టమ్స్ చట్టాల కింద బెయిల్ మంజూరు చేసింది.

అయితే ఎఫ్ఐఆర్ నమోదు కోసం స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) ఐజీఐ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయడానికి స్వాధీనం చేసుకున్న అవశేషాలను వన్యప్రాణి విభాగానికి అప్పగించాలని డ్యూటీ మేజిస్ట్రేట్ కస్టమ్స్ అధికారులను ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube