Clever Bird : చేపల వేటలో ఇది ఆరి తేరింది.. దీని స్టైల్ చూస్తే ఆశ్చర్యపోతారు!

చాలా మందికి చేపలు( Fishes ) పట్టడం ఇష్టం.దీని కోసం విదేశాల్లో అయితే ప్రత్యేకించి ఒక రోజును అక్కడి ప్రజలు కేటాయిస్తారు.

 Clever Bird Catching Fish By Throwing Bait Video Going Viral-TeluguStop.com

ఇలా పట్టిన చేపలు కాల్చుకుని ఎంతో ఇష్టంగా తింటుంటారు.అయితే చేపలు వేటాడే సమయంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది.

కొందరు గేలం వేసి చేపలు పడతారు.కొందరు వలలు వేస్తుంటారు.

ఇంకొందరు బాణాలు వేసి కూడా చేపలను వేటాడుతుంటారు.అయితే తెలివితేటలు కేవలం మనుషులకు మాత్రమే సొంతం కాదని ఓ పక్షి అంటోంది.

తన తెలివితేటలను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.చేపలు వేటాడడంలో ఆ పక్షి స్టైల్ చూసి అంతా అవాక్కవుతున్నారు.

మనుషుల తరహాలోనే ఆ పక్షి( Bird ) చేపలను వేటాడుతుండడం విశేషం.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

నీటిలో కనిపించే చేపలను కొన్ని పక్షులు ఆహారంగా చేసుకుంటాయి.నీటిలో ఈదుతున్న పక్షులను ఆకాశంలో నుంచి కొన్ని పక్షులు గమనిస్తాయి.అమాంతం నీటిలోకి దూకి ఆ చేపలను నోట కరుచుకుని వెళ్లిపోతాయి.ఇలాంటి ఘటనలు చూశాం.అయితే ఒడ్డునే నిలబడి వేటాడే పక్షి ఏదైనా ఉందా అంటే మాత్రం అది అరుదు అని మనం భావిస్తాం.మనుషుల తరహాలోనే ఓ పక్షి చేపలను వేటాడుతూ తినేస్తోంది.

మనుషుల మాదిరిగానే, మొదట తమ ఎరను( Bait ) వేస్తోంది.దానిని తినేందుకు వచ్చిన చేపలను చటుక్కున వేటాడుతోంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కొంగ తన ఎర కోసం నది ఒడ్డున వేచి ఉండడాన్ని చూడవచ్చు.ఆ కొంగ, ఒక రాయి నుండి మరొక రాయికి కదులుతుంది.

చేపలు ఎక్కడకు వస్తున్నాయో గమనించింది.ఆ తర్వాత మనుషుల తరహాలో చేపలను ట్రాప్( Fish Trap ) చేయడానికి ప్రయత్నించింది.

చేపలకు ఇష్టమైన ఆహారం నదిలో వేసింది.

దీంతో చేపలు రాలేదు.ఆ తర్వాత మరికొంత ఎరను తీసుకొచ్చి నదిలో వేసింది.అక్కడకు కొన్ని చేపలు వచ్చాయి.

వాటిలో తనకు నచ్చిన చేపను ఆ పక్షి సెలెక్ట్ చేసుకుంది.తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయడకుండా ఆ చేపను చటుక్కున నోటితో కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

చేపలను ఇలా వేటాడడానికి మనుషులు ఇష్టపడతారు.అయితే మనుషులకే కాదని, తనకు కూడా తెలివితేటలు ఉన్నాయని ఆ చేప నిరూపించింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.దీంతో దాని తెలివితేటలు చూసి నెటిజన్లు( Netizens ) ఆశ్చర్యపోతున్నారు.

ఇది స్మార్ట్ పక్షి అని కితాబిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube