అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.
రామారావు( Akkineni Nageswara Rao, NT Rama Rao ) ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలారు.ఒకే సమయంలో స్టార్డం తెచ్చుకున్నా, టాప్ హీరోలుగా కొనసాగినా వారు ఎలాంటి భేషజాలకు పోకుండా అన్నదమ్ముల్లా మసలేవారు.
కలిసి నటించేందుకు సందేహించేవారు.అలాంటిది ఒక్కసారిగా వారి మధ్య కలతలు వచ్చాయి.
అక్కినేని నాగేశ్వరరావు భార్య అన్నపూర్ణ ( Annapurna ) కారణంగానే వారి బంధం చెడిపోయింది.ఎన్.
టి.రామారావుతో కలిసి యాక్ట్ చేయవద్దని ఆమె ఏఎన్ఆర్ వద్ద మాట తీసుకుంది.భార్య మాట కాదనలేక ఏఎన్ఆర్ 14 ఏళ్ల పాటు ఎన్టీఆర్ తో కలిసి ఒక్క సినిమాలో కూడా యాక్ట్ చేయలేదు.
అక్కినేని, ఎన్టీఆర్ 1950లో ‘పల్లెటూరి పిల్ల’( Palleturi Pilla )తో కలిసి నటించడం మొదలుపెట్టి, ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.1963లో ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ వారి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం.‘కృష్ణార్జున’ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు, ఏఎన్నార్ అర్జునుడిగా నటించాలని అనుకున్నారు.కానీ ఏఎన్నార్ ఒప్పుకోలేదు.దీంతో ‘కృష్ణార్జున’ సినిమా ఆగిపోయి, ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’గా రూపొందింది.మొదట ఏఎన్నార్ ఒప్పుకోకపోయినా, తమ సినిమా ‘దొంగరాముడు’కి కె.వి.రెడ్డి దర్శకత్వం వహించడం వల్ల ఒప్పుకున్నారు.సినిమా విజయవంతమైనా, ఏఎన్నార్ పాత్ర చిన్నదిగా ఉండడంతో ఆయన అభిమానులు బాధపడ్డారు.

ఈ సినిమా మహాభారత కథ ఆధారంగా తెరకెక్కింది.అందువల్ల కృష్ణుడి పాత్ర ఎక్కువసేపు అర్జునుడి పాత్ర తక్కువసేపు ఉంటుంది.‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ ( Sri Krishnarjuna yuddam )చిత్రంలో ఏఎన్నార్ పాత్ర చిన్నదిగా ఉండటంతో ఆయన అభిమానులు సతీమణి అన్నపూర్ణ వద్దకు వెళ్లి వాపోయారు.అన్నపూర్ణ కూడా సినిమా చూసి అభిమానుల వలే బాగా ఫీల్ అయిపోయారు.
దాంతో సీనియర్ ఎన్టీఆర్ తో నటించడం పట్ల అన్నపూర్ణ అభ్యంతరం తెలిపారు.దీంతో 14 సంవత్సరాల పాటు ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించలేదు.1977లో ‘చాణక్య చంద్రగుప్త’( Chanakya Chandragupta ) చిత్రంతో మళ్లీ కలిసి నటించారు.

నిజానికి ఎన్టీఆర్ స్వయంగా ఏఎన్ఆర్ ఇంటికి వెళ్లి ఈ సినిమాలో నటించాలని కోరిన తర్వాతే అక్కినేని అందుకు ఒప్పుకున్నారు.ఆ తర్వాత ‘రామకృష్ణులు’, ‘సత్యం శివం’ చిత్రాల్లో మాత్రమే కనిపించారు.1983లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతో వారి కాంబినేషన్‌కు తెరపడింది.ఒకవేళ కృష్ణ అర్జున యుద్ధం సినిమా చేయకపోయి ఉంటే వీరిద్దరూ కలిసి మరెన్నో సినిమాలు చేసి ఉండేవారు.అభిమానులకు కూడా ఎలాంటి బాధ కలిగి ఉండకపోయేది.కానీ కె.వి.రెడ్డి అర్జునుడి పాత్రకు ఏఎన్నార్ బాగా సూట్ అవుతాడని పట్టుబట్టి మరీ నటింపజేశారు.







