బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండని సవాల్ చేశారు.
ఈ క్రమంలోనే మహేశ్వర్ రెడ్డికి( BJP MLA Maheshwar Reddy ) జ్యోతిష్యం తెలుసా అని ఎద్దేవా చేశారు.దేనినైనా ఎదుర్కొనే శక్తి తమకుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ బలహీనవర్గాలకు బీఆర్ఎస్( BRS ) ఏం చేసిందని ప్రశ్నించారు.
బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారన్న ఆయన కనీసం పార్టీ పదవుల్లోనైనా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారా అని నిలదీశారు.
తన గురించి చెత్తవాగుడు వాగితే సహించేది లేదని చెప్పారు.నాలుగు నెలల్లోనే ఎన్నో పథకాలు తెచ్చామన్న మంత్రి పొన్నం కులవృత్తుల్లో సాంకేతికత తీసుకొస్తున్నామని తెలిపారు.అదేవిధంగా బీసీ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు.
బలహీనవర్గాలకు మేలు చేసేది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు.