ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్( Election Flying Squad ) పేరుతో నకిలీ ముఠా భారీగా వసూళ్లకు పాల్పడింది.ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
కిరణా షాపులు, బెల్ట్ షాపుల నిర్వాహకులను బెదిరించిన నకిలీ అధికారుల బృందం డబ్బులను వసూలు చేసినట్లు తెలుస్తోంది.దాంతో పాటుగా పలు గ్రామాల్లో అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడ్డారని సమాచారం.
క్యాష్ ఇవ్వలేని వారి వద్ద నుంచి ఫోన్ పే చేయించుకున్నారని బాధితులు చెబుతున్నారు.అనంతరం నకిలీ అధికారులుగా గుర్తించిన బాధితులు లబోదిబోమంటున్నారు.