గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలోని పోకడ గమనిస్తే ఏ చిత్రమైన సరే దాదాపు రెండేళ్లు లేదా మూడేళ్లు షూటింగ్ జరుపుకుంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే.దీని వల్లే ఎంత మంది అవునన్నా కాదన్నా సినిమా బడ్జెట్ చేయి జారిపోతుంది.
ఆ సినిమా బడ్జెట్ ను మళ్లీ కలెక్షన్స్ రూపంలో సాధించడం కష్టం అయిపోతుంది.అందుకే ఇప్పుడు రాజమౌళి సుకుమార్ లాంటి సీనియర్ దర్శకులను( Senior directors ) పక్కన పెడితే మిగతా దర్శకులు అంతా కూడా ఆ తమ సినిమాలను వంద రోజుల్లో పై పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంటున్నారట.
ఇది అంత ఈజీ అయిన పని కాదు అని అనిపిస్తుంది కదా ? కానీ ఖచ్చితంగా సాధ్యమే.మరి 100 రోజుల్లో సినిమాలను పూర్తిచేసిన ఆ దర్శకులు ఎవరు? ఇప్పుడు కొత్తగా 100 రోజుల టార్గెట్ పెట్టుకున్న చిత్రాలు ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ( Bro, Vakil Saab, Bhimla Naik )వంటి మూడు చిత్రాలు కూడా కేవలం 100 రోజుల పాటు షూటింగ్ జరుపుకొని విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్నవే.చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బోలా శంకర్, గాడ్ ఫాదర్( Waltheru Veeraiah, Bola Shankar, Godfather ) సినిమాలు కూడా కేవలం 100 రోజుల పాటు షూటింగ్ జరుపుకునే విడుదలయ్యాయి.వీటి ఫలితాల సంగతి పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీకి ఈ తరహా టార్గెట్ ఫిక్స్ చేసిన మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి.ఇక మరో సీనియర్ హీరో నాగార్జున మొన్న సంక్రాంతికి విడుదల చేసిన నా సామీ రంగా చిత్రం( Na Sami Ranga movie ) కేవలం 50 రోజుల పాటు షూటింగ్ చేసుకుంది.

ఇక విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ( Family star movie )అయితే పరుశురాం విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోతో వంద రోజుల్లోనే పూర్తి చేయగా, పవన్ కళ్యాణ్ తీస్తున్న ఓజీ సినిమా( OG movie ) 70% షూటింగ్ కేవలం 30 రోజుల్లోనే పూర్తయింది.ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా( Ustad Bhagat Singh movie ) కోసం పవన్ కళ్యాణ్ కేవలం 40 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు.అలాగే రవితేజ మిస్టర్ బచ్చన్( Mr.Bachchan ) సినిమాకి కూడా 75 రోజులు టార్గెట్ మాత్రమే పెట్టుకున్నారు.సాధారణంగా హరీష్ శంకర్ చాలా వేగంగా సినిమాల తీస్తారు.ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కూడా అతివేగంగా నిర్మాణం జరుపుకుంటుంది.ఇక బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా కూడా 100 రోజుల టార్గెట్ ఫిక్స్ చేసుకుందట ఇది కాకుండా చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాకి విఎఫ్ఎక్స్ కోసం ఎక్కువ టైం కేటాయించిన షూటింగ్ పార్ట్ మాత్రం కేవలం వంద రోజులు మాత్రమే అని తెలుస్తోంది.







