నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ప్రతినిధి మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవడంతో పాటు సంచలనం సృష్టించింది.ఈ సినిమాకు సీక్వెల్ కాకపోయినా ప్రతినిధి2 సినిమా( Prathinidhi 2 ) గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది.
కంటెంట్ బేస్ద్ సినిమాలలో నటించి క్రేజ్ ను పెంచుకున్న నారా రోహిత్ ( Nara Rohith )ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మన రాష్ట్ర అప్పు ఎంత ఉంటుంది సార్? అంటూ నారా రోహిత్ అడగగా అజయ్ ఘోష్ ( Ajay Ghosh )పాత్ర 5 లక్షల కోట్ల రూపాయలు అని సమాధానం ఇస్తుంది.5 లక్షల కోట్లు తీర్చాలంటే ఎంత సమయం పడుతుందని నారా రోహిత్ అడగా ” అభివృద్ధి ఉంటే అదెంతసేపు అబ్బా?” అని చెప్పగా అదెక్కడుంది సార్ అంటూ రోహిత్ రివర్స్ లో ప్రశ్నిస్తాడు.“ఇప్పటికైనా కళ్లు తెరవండి ఒళ్లు విరిచి బయటకు వచ్చి ఓటు వెయ్యండి.లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి.అదీ కుదరకపోతే చచ్చిపోండి” అని చెప్పుకొచ్చారు.
“జనం కోసం బ్రతికితే చచ్చాక కూడా జనంలోనే బ్రతికి ఉంటాం” లాంటి డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం.ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.అయితే ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది.నారా రోహిత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
యూట్యూబ్ లో ఈ టీజర్ కు అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ వచ్చాయి.ప్రతినిధి2 సినిమా టీడీపీకి ఎంత మేలు చేస్తుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.