జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి ఆకస్మిక తనిఖీ చేసి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా సరిహద్దుల్లో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 District Sp Akhil Mahajan Made A Surprise Inspection Of The Check Post Set Up At-TeluguStop.com

నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు,నగలు, ఇతరత్రా సొత్తును సీజ్‌ చేసి జిల్లా గ్రీవియన్స్ కమిటీ కి అప్పజెప్పడం జరుగుతుందన్నారు.ఎన్నికల నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు.ఎస్పీ వెంట ఎస్.ఐ సుధాకర్ సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube