సిరిసిల్లలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి ఆవునూరి దయాకర్ రావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కేంద్రంగా బడుగు బలహీన వర్గాలకు బాసటగా స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు పార్టీకి అంకురార్పణ చేసారన్నారు.

 Telugu Desam Party Foundation Day Celebrations In Sircilla, Telugu Desam Party ,-TeluguStop.com

బీసి, ఎస్సీ,ఎస్టీ లకు రాజ్యాధికారం కల్పించే లక్ష్యంతో నాడు పెట్టిన పార్టీ నేటికీ బడుగు బలహీన వర్గాల మదిలో చెరగని ముద్రవేసిందన్నారు.పేదవాడు అర్దాకలితో అలమటిస్తున్న తరుణంలో రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదవారి ఆకలి తీర్చారన్నారు.

సగం ధరకే జనతా వస్త్రాలు,అందరికీ పక్కా ఇళ్లనిర్మాణం తదితర సంక్షేమ పథకాలు అందించారన్నారు.సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఏర్పడిన పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్, టీ,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి,ఎస్సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్క రాజయ్య, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆడేప్ లక్ష్మీ నారాయణ, కొనరావుపేట జడ్పీటిసి అభ్యర్థి మోతె బాలవ్వ,పట్టణ కోశాధికారి మోతె స్నేహారెడ్డి,పంజా బాలరాజు,మిద్దె ప్రకాష్,జెట్టి కొమురయ్య,గుజ్జె అశోక్,పండుగ స్వామీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube