President Joe Biden : బోయింగ్‌ విమానాల్లో వరుస ప్రమాదాలు.. డోర్ దగ్గర కూర్చోనంటూ జో బైడెన్ సెటైర్లు

ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ బోయింగ్ ( Boeing ) రూపొందించిన విమానాలు ఇటీవలి కాలంలో వరుసగా ప్రమాదాల బారినపడుతూ వుండటంతో విమర్శకులు, నిపుణులు వాటి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( US President Joe Biden ) బోయింగ్ సంస్థపై సెటైర్లు వేశారు.

 Us President Joe Biden Makes Jokes On Boeing-TeluguStop.com

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం జో బైడెన్ న్యూయార్క్‌లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సీబీఎస్ లేట్ షో హోస్ట్ స్టీవెన్ కోల్‌బర్ట్, ( Steven Colbert ) అధ్యక్షుడితో కలిసి న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు.

అంతకుముందు ఎయిర్‌ఫోర్స్ వన్ (అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం)కు బోల్ట్‌లను బిగించారా అని రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్ ఆరా తీశారు.

బోయింగ్‌ విమానాల్లో జరుగుతున్న వరుస పరిణామాలపై బైడెన్ స్పందిస్తూ.

తాను తలుపు దగ్గర కూర్చోనని సెటైర్లు వేశారు.కానీ ఆ వెంటనే అప్రమత్తమై తాను జోక్ చేస్తున్నానంటూ కామెంట్ చేశారు.

ఎయిర్‌ఫోర్స్ వన్‌ను( Air Force One ) బోయింగ్ సంస్థే తయారు చేసింది.బోయింగ్ 747 200 బీ విమానాన్ని అమెరికా అధ్యక్షుడి కోసం శత్రుదుర్భేద్యయంగా రూపొందించింది.

దీనిని ఎగిరే శ్వేతసౌథంగా వ్యాఖ్యానిస్తూ వుంటారు.

Telugu Air Force, Max, Federal, Joe Biden, Steven Colbert-Telugu NRI

ఇకపోతే .ఈ ఏడాది జూన్ 5న 171 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 9 మ్యాక్స్( Boeing 737 Max 9 ) విమానం డోర్ గాల్లోనే ఊడి ఎగిరిపోయింది.ఈ ఘటనతో ప్రయాణీకులంతా ప్రాణభయంతో వణికిపోయారు.

ఈ ఫ్లైట్ పోర్ట్‌ల్యాండ్ నుంచి అంటారియోకు బయల్దేరింది.అయితే టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఎమర్జెన్సీ డోర్( Emergency Door ) ఊడి ఎగిరిపోయింది.

గాలి ఒత్తిడి కారణంగా ఆ డోర్ పక్కనే వున్న సీటు కూడా గాల్లోకి ఎగిరిపోయింది.ఆ వెంటనే ఆక్సిజన్ మాస్కులు వేలాడుతూ బయటకు వచ్చాయి.

Telugu Air Force, Max, Federal, Joe Biden, Steven Colbert-Telugu NRI

పైలట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని తిరిగి పోర్ట్ ల్యాండ్‌కు తరలించాడు.అయితే ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కానీ బోయింగ్ 737 9 మ్యాక్స్ విమానాల భద్రతపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.అలస్కాలో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) కీలక నిర్ణయం తీసుకుంది.

అన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube