టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంత ( Samantha ) అనారోగ్య సమస్యల కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే .ఈమె మాయోసైటిసిస్ వ్యాధి బారినపడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అయితే ఈ సమస్య నుంచి బయట పడటానికి తాను చాలా కష్టపడ్డాను అంటూ సమంత ఇటీవల వెల్లడించారు.ఇక మయోసైటిస్( Myositis ) తర్వాత ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్( Side Effects ) ని అధికమించడానికి కూడా చాలా సమయం పట్టిందని అందుకే తాను సినిమాలకు విరామం ఇచ్చినట్టు తెలిపారు.
ఇటీవల ఈ వ్యాధి నుంచి కోలుకున్నటువంటి ఈమె సోషల్ మీడియా వేదికగా పాడ్ కాస్ట్ లో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తున్నారు.
సిటాడెల్ ( Citadel ) వర్క్ షాప్ లో ట్రైనింగ్ సెషన్ నిర్వహించారు.ట్రైనింగ్ సెషన్ లో నా శక్తి సగానికి తగ్గిపోయింది.ఆ విషయం నాకు అర్థం అవుతుంది.
ఇలా శక్తి తగ్గిపోవడం ఒక వైపు మరో వైపు భారీ యాక్షన్ సన్నివేశాలలో( Action Scenes ) నటిస్తూ తీవ్రమైనటువంటి గాయాలు పాలయ్యాను.ఈ బాధ మరోవైపు ఆ సమయంలో నేను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు వర్ణాతీతం అని తెలిపారు.
ఇక నా శరీరం వ్యాధుల నుంచి కోలుకోవడానికి ఆహారం కూడా పూర్తిగా తగ్గించేసానని సమంత వెల్లడించారు.
చాలాకాలం పాటు ఈ బాధలు భరించానని ముఖ్యంగా విపరీతమైనటువంటి కండరాల నొప్పులు తనని వేధించాయి అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.ఇలా ఈ వ్యాధి కారణంగా ఈమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేయడంతో అభిమానులు ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం సమంత ఇన్ని కష్టాలు పడ్డారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక త్వరలోనే సమంత( Samantha Health ) తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.