Viral Video: ఫొటో తీసేందుకు ఎన్‌క్లోజర్‌ లోకి చేయి పెట్టిన ఘనుడు.. చివరికి..?!

అడవికి రారాజు సింహం( Lion )అంతటి దానితో చెలగాటం అంటే అంతా ఆశమాషి విషయం కాదు.అయితే కేవలం అడవుల్లో కనిపించే సింహాలు చాలా తక్కువగా బయట కనబడతాయి.

 A Young Man Put His Hand Into The Enclosure To Take A Photo Finally Viral-TeluguStop.com

జూలలో వీటిని మనం తరచూ చూడవచ్చు.అయితే ఈ సమయంలో సెల్ ఫోన్లో సింహాల దృశ్యాలని తీయాలని.

, అలాగే వాటితో సెల్ఫీలు దిగాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.మరికొందరు మద్యం తాగిన మత్తులో వాటిని ఏదోలా పలకరించాలని అప్పుడప్పుడు కొందరు ప్రాణాల మీదికి తెచ్చుకున్న వారు కూడా లేకపోలేదు.

ఇలా చేస్తున్న సమయంలో కొన్నిసార్లు సింహాలు కూడా చిత్ర విచిత్రంగా కూడా ప్రవర్తిస్తుంటాయి.తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి జరిగింది.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

వీడియోలో ఉన్న దాని ప్రకారం చూస్తే.సింహాన్ని ఫోటో తీయాలని ఉద్దేశంతో ఓ యువకుడు సింహం ఉన్న ఎన్ క్లోజర్ లోకి చేయి పెట్టాడు.అయితే రోజు ఆ యువకుడుది కావడంతో బతికిపోయాడు.సింహాన్ని చూడాలని వచ్చిన ఆ సందర్శకుడు ఎన్ క్లోజర్ అడ్డుగా ఉండడంతో సింహాన్ని క్లియర్ గా ఫోటో తీయడం కుదరలేదు.

దీంతో అతను ఎన్ క్లోజర్( Enclosure ) లోకి చేయి పెట్టి ఫోన్ తో రికార్డు చేయసాగాడు.అయితే అదే సమయంలో మరో వ్యక్తి సింహానికి ఆహారం పెడుతుండడం గమనించవచ్చు.

అలా ఆహారం తింటున్న సమయంలో సడన్ గా ఆ సింహం ఫోటో తీస్తున్న వ్యక్తిని గమనించింది.అయితే వెంటనే ఆ సింహం ఆవేశంగా అతడి వద్దకు చేరుకుంది.కాకపోతే సింహం అతని చేతిని కొరికేస్తుందని అందరూ భావించారు.కానీ అనూహ్యంగా సింహం అది చేయి పై కాలు పెట్టింది.

ఏదో.ఆ యువకుడు తప్పు చేస్తున్నట్టు.నువ్వు ముందు చేయి బయటికి తీసుకో అని చెప్పినట్లుగా., తన చేతిని ఎన్ క్లోజర్ నుండి బయటకి నెట్టేస్తుంది.మనుషులను చూస్తూనే దాడి చేసే సింహం ప్రస్తుతం ఇలా మానవత్వం ప్రదర్శించడం చూసి అక్కడున్న వారందరూ ఆచారం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియో సంబంధించి నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.తాము ఎప్పుడు ఇలాంటి సింహాన్ని చూడలేదని కొందరు అంటుంటే.

మరికొందరు ఈ సింహం గమ్మత్తుగా ఉందంటూ కితాబిస్తున్నారు.మరికొందరైతే మానవత్వం గల సింహం అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube