Viral Pic : పైలట్ తీసిన అద్భుతమైన ప్రకృతి దృశ్యం.. సోషల్ మీడియాని షేక్‌ చేస్తోందిగా..!

నెదర్లాండ్స్‌కు చెందిన క్రిస్టియాన్ వాన్ హీజ్స్ట్( Christiaan van Heijst ) అనే పైలట్ ఇటీవల తన విమానం కాక్‌పిట్ నుంచి ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ఫోటో తీశాడు.ఆ ఫోటో నార్తర్న్ లైట్స్‌కు సంబంధించినది.

 Dutch Pilot Shares Rare Glimpse Of Aurora Borealis Taken From Cockpit-TeluguStop.com

అది అద్భుతంగా ఉండి సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.వాన్ హీజ్స్ట్ తన విమానాల నుంచి ఆకట్టుకునే ప్రకృతి అందాలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.

ఈసారి, అతను ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం( Atlantic Ocean ) మీదుగా ఎగురుతున్నప్పుడు అంతుచిక్కని అరోరా బోరియాలిస్‌ను ఫోటో తీయగలిగాడు.సముద్రం పైన అద్భుతమైన దృశ్యంగా ఇది కనిపించింది.

ఫొటో రాత్రి పూట ఆకాశం రంగురంగుల మణి హారాలతో నిండిపోయినట్లుగా చూపించడం మనం చూడవచ్చు.నీలి, ఆకుపచ్చ, ఎరుపు రంగులు ఒకదానితో ఒకటి కలిసి అద్భుతమైన కాంతి ప్రదర్శనను సృష్టించాయి.

దూరంగా, ఐస్లాండ్ రాజధాని రేక్జావిక్( Reykjavik ) నగరంలోని ఆరంజ్ కలర్ లైట్స్ ఈ అందమైన కాంతికి ఒక చక్కని వ్యత్యాసాన్ని జోడించాయి.

నార్తర్న్ లైట్స్( Northern Lights ) కనిపించడానికి ముందు చాలా సేపు పైలట్లు సైలెంట్ గా విమానాన్ని నడుపుతూ ప్రయాణం సాగించారు.అలా ఎగురుతూ ఉండటం వాన్ హీజ్స్ట్ కి ఒక విచిత్రమైన అనుభవంగా అనిపించింది.అంతలోనే రేక్జావిక్ నగరంలోని దూరపు దీపాలు అతనికి కలిగే ఏకాంత భావాలను గుర్తు చేశాయి.

వాన్ ఎప్పుడూ మౌనంగా ఉండే తన కో-పైలట్‌కు( Co-Pilot ) నార్తర్న్ లైట్స్ చూపించగానే అతడు వావ్ అంటూ ఆశ్చర్యపోయాడట.మాట్లాడకపోయినా, ఇద్దరు పైలట్లు కలిసి నార్తర్న్ లైట్స్ చూడటంలో ఆనందించారు.

పైలట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఈ ఫోటో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు, దీనిని చాలా బాగా తీశారని ప్రశంసించారు.అరోరా అందం చూసి మంత్రముగ్ధులైపోయామని కొందరు అన్నారు.ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ఫోటో చెప్పకనే చెబుతోందని మరికొందరు వ్యాఖ్యానించారు.ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube